HomeMovie News Teluguఅయ్యోపాపం కత్తెరేసేశారా?

అయ్యోపాపం కత్తెరేసేశారా?

కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రంగూన్‌’ సినిమాకి కత్తెర పడిందట. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు ఈ చిత్రానికి రీ-ఎడిటింగ్‌ చేశారని తెలియవస్తోంది. ఇందులో హాట్‌ హాట్‌ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో చాలా వరకూ సెన్సార్‌ బోర్డు వారు కటింగ్స్‌ చేశారని తెలుస్తోంది. చారిత్రాత్మక కథాంశంతో యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. సైఫ్‌ అలీఖాన్‌, షాహిద్‌ కపూర్‌ ఇందులో హీరోలుగా నటించారు. ఫిబ్రవరి 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాజిద్‌ నడియడ్‌వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దర్శకుడు విశాల్‌ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించాడు.

యుద్ధ సన్నివేశాలు గగుర్పొడిచేలా ఉండబోతున్నాయి. అలాగే రొమాంటిక్‌ సన్నివేశాలు కూడా బాలీవుడ్‌ తెరపై ఇంతకు ముందెన్నడూ లేనంత హాట్‌గా ఉంటాయట. కానీ 40 నిమిషాలు రీ-ఎడిటింగ్‌ చేయడం వల్ల ఏ సన్నివేశాలకు కత్తెర వేశారో తెలియరావడంలేదు. ఇంత చారిత్రక నేపధ్యం ఉన్న సినిమాలో ఉన్న హాట్‌ సీన్స్‌ ఎంత హాట్‌గా ఉన్నాయో ఏమో మరి. సెన్సార్‌ కత్తెరకు గురయ్యేంతగా. గతంలో హృతిక్‌ రోషన్‌, పూజా హెగ్దే నటించిన ‘మొహంజోదారో’ సినిమా కూడా ఇలాగే చారిత్రక నేపధ్యంలో తెరకెక్కింది.

అందులో కూడా హాట్‌ సీన్స్‌ ఉన్నప్పటికీ, సెన్సార్‌ నుండి అంతగా అభ్యతరాలు వచ్చిన దాఖలా లేదు. అయితే కంగనా ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ సినిమాలో ఈ హాట్‌ సీన్‌ కత్తెర వార్త మాత్రం హాట్‌ హాట్‌గా చక్కర్లు కొట్టడంతో సినిమాకి మరింత హైప్‌ పెరుగుతోంది. ఇదో రకం పబ్లిసిటీ స్టంట్‌ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular