HomeMovie News Teluguసూపర్‌ స్టార్‌ సరసన హాట్‌ బ్యూటీ

సూపర్‌ స్టార్‌ సరసన హాట్‌ బ్యూటీ

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సరసన హాట్‌ బ్యూటీ విద్యాబాలన్‌ నటించనుంది. ‘కబాలి’ సినిమాలో రాధికా ఆప్టే నటించింది. ఆ సినిమా సీక్వెల్‌ చేయనున్నాడు పా రంజిత్‌. ‘కబాలి’ సినిమా విడుదలకు ముందు క్రియేట్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కానీ ఆ సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు డైరెక్టర్‌ పా రంజిత్‌. అందుకే ఆ సినిమా ద్వారా జరిగిన తప్పొప్పులు సరిదిద్దుతూ, రజనీకాంత్‌ అల్లుడు, తమిళ హీరో ధనుష్‌ ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నాడు. అందుకే ఇది ‘కబాలి’ సీక్వెల్‌ కానుంది.

ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ విద్యా బాలన్‌ని హీరోయిన్‌ పాత్రకు ఎంపిక చేశారని సమాచారమ్‌. విలక్షణ పాత్రల్ని ఎంచుకుంటూ హాట్‌ అవతార్‌ని కొనసాగిస్తూ వస్తున్న విద్యాబాలన్‌కి ఈ సినిమా మరో ల్యాండ్‌ మార్క్‌ కానుందట. ‘కబాలి’ అంచనాల్ని అందుకోలేకపోయినా, ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రాధికా ఆప్టేకు మాత్రం నటిగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమాలో విద్యాబాలన్‌ క్యారెక్టర్‌ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రగా ఆమె క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశారట డైరెక్టర్‌.

ఇంకో వైపున రజనీకాంత్‌ ‘2.0’ సినిమాలో నటిస్తున్నాడు. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రోబోకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇందులో ముద్దుగుమ్మ అమీ జాక్సన్‌ లేడీ రోబోగా నటిస్తుండగా, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular