HomeMovie News Teluguరమ్యకృష్ణ దూకుడు

రమ్యకృష్ణ దూకుడు

కెరీర్‌లో కొత్త ఫేజ్‌లో సీనియర్‌ నటి రమ్యకృష్ణ దూకుడు ప్రదర్శిస్తోంది. గ్లామరస్‌ హీరోయిన్‌గా దాదాపు తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరోలందరి సరసనా రమ్యకృష్ణ నటించి మెప్పించింది. తమిళ సినిమాల్లోనూ, అలాగే హిందీ సినిమాల్లోనూ గ్లామరస్‌ హీరోయిన్‌గా సత్తా చాటిన రమ్యకృష్ణ కొత్త ఫేజ్‌లో అద్భుతమైన పాత్రలు దక్కించుకుంటోంది. ‘బాహుబలి’ సినిమాలో ఆమె పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె ఆ సినిమాకి మెయిన్‌ పిల్లర్‌.

తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా రమ్యకృష్ణ ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్టుల్లో కనిపించనుంది. తాజాగా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ‘తానాసేంద కూట్టం’ అనే సినిమాలో నటించనుంది రమ్యకృష్ణ. ఈ సినిమాలో సూర్య హీరోగా నటిస్తున్నాడు. ఇందులో పోలీస్‌ గెటప్‌లో రమ్యకృష్ణ నటించనున్నట్లు తెలియవస్తోంది. చాలా పవర్‌ఫుల్‌గా రమ్యకృష్ణ పాత్రని విఘ్నేష్‌ తీర్చిదిద్దాడట. ఇదే కాకుండా ‘శభాష్‌ నాయుడు’ సినిమాలోనూ రమ్యకృష్ణ నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది. ‘బాహుబలి-2’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

రజనీకాంత్‌ హీరోగా వచ్చిన ‘పడయప్పా’ సినిమాలో ఆమె పోషించిన నీలాంబరి పాత్రకు మించి ‘తానాసేంద కూట్టం’లో రమ్యకృష్ణ పాత్ర ఉంటుందని దర్శకుడు విఘ్నేష్‌ అంటున్నాడంటే ఆమె ఎంత పవర్‌ఫుల్‌ పాత్రని ఆయన ఇచ్చాడో అర్థమవుతుంది. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించడం రమ్యకృష్ణ ప్రత్యేకత. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular