HomeMovie News Teluguచైతూ, సమంతతో ఓ అతిథి!

చైతూ, సమంతతో ఓ అతిథి!

సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా ముద్దుగుమ్మ సమంత సోషల్‌ మీడియాని వదిలి పెట్టలేదు. రెగ్యులర్‌గా అభిమానులతో సోషల్‌ మీడియాలో సందడి చేసేది. అలాంటిది ప్రస్తుతం సమంత పెళ్లి పేరు చెప్పి సినిమాల్లో కొంచెం గ్యాప్‌: తీసుకుంది. తమిళంలో సినిమాలు చేస్తున్నా, తెలుగులో మాత్రం అమ్మడి చేతిలో రాంచరణ్‌ – సుకుమార్‌ సినిమా ఒక్కటే ఉంది. అందుకే తన పర్సనల్‌ లైఫ్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తోంది. ఇటీవలే సమంత, నాగ చైతన్య నిశ్చితార్ధం జరిగిందన్న విషయం తెలిసిందే.

నిశ్చితార్ధానికి ముందు కూడా వీరిద్దరి మధ్యా స్వీట్‌ మెమరీస్‌ని ఫ్యాన్స్‌తో పంచుకునేది సామ్‌ బ్యూటీ. అది ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువే అయ్యిందని తెలుస్తోంది సోషల్‌ మీడియాలో తన లేటెస్ట్‌ పోస్ట్‌లను బట్టి చూస్తుంటే. వీకెండ్‌ని సమంత ఎంత బాగా ఎంజాయ్‌ చేసిందోనట. ఎవరితోననుకుంటున్నారా? చైతూతో కాదు. తన బుజ్జి కుక్కపిల్లతో. అఫ్‌కోర్స్‌ చైతూ కూడా అక్కడే ఉన్నాడనుకోండి. ఆ బుజ్జి కుక్కపిల్లను బ్యూటీ సమంత ప్రేమగా హత్తుకుంటే ఎంత క్యూట్‌గా ఉందో కదా.

ఆ క్యూటీ లుక్స్‌తో ఉన్న తన లైఫ్‌ పార్టనర్‌ని చూసి చైతూ వెనకి నుంచి మురిసిపోతున్నాడు. ఇది ఇంకా బావుంది. ఈ ఫోటోనే ఫ్రెష్‌గా సమంత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. సమంత పోస్ట్‌ల కోసం ఎప్పటికప్పుడు ఎదురు చూసే ఫ్యాన్స్‌ ఈ ఫోటోకి బోలెడన్ని లైకులిచ్పేశారు. తమకి నచ్చిన కామెంట్స్‌ కూడా పెట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఏదో ఒక కామెంట్‌ చేయండి మరి. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular