HomeMovie News Teluguబాలయ్య ఆ న్యూస్‌ చెప్పేదెప్పుడో!

బాలయ్య ఆ న్యూస్‌ చెప్పేదెప్పుడో!

‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా తర్వాత జోరు పెంచుతాడనుకున్న బాలకృష్ణ, మౌనం దాల్చాడు. ఆ సినిమా టైంలో బాలయ్య చాలా జోరు ప్రదర్శించారు. కృష్ణవంశీతో ‘రైతు’ సినిమాని అనౌన్స్‌ చేసి, ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. కానీ ‘శాతకర్ణి’ సినిమా తర్వాత బాలయ్య స్లో అయ్యారు. తదుపరి సినిమా ఏమిటో ఆయన క్లారిటీ ఇవ్వడంలేదు. బోయపాటితో ఓ సినిమా చేయవలసి ఉంది. అలాగే ఇంకొందరు దర్శకులు కూడా బాలకృష్ణతో సినిమాని ఫైనల్‌ చేయించుకోడానికి ట్రై చేస్తున్నారు.

అన్నీ సరిగ్గా కుదిరి ఉంటే బాలకృష్ణ అనౌన్స్‌ చేసిన దాని ప్రకారం, 101వ చిత్రం ‘రైతు’ అయి ఉండేది. కానీ ఆ సినిమాకి బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ సహకారం సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. కానీ బాలయ్య కోసం పలువురు డైరెక్టర్లు కథలు పట్టుకుని రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు కెఎస్‌ రవికుమార్‌ డైరెక్షన్‌లో సినిమా చేయడానికి బాలకృష్ణ దాదాపుగా ఓకే చెప్పారని సమాచారమ్‌. అయితే బాకలృష్ణ ఇంకా దీన్ని ఖరారు చేయవలసి ఉంది.

‘శాతకర్ణి’ వంటి అపూరూపమైన చిత్రాన్ని ఫ్యాన్స్‌కి అందించిన బాలయ్య తదుపరి సినిమాలో కొంచెం ఆచి తూచి అడుగులేస్తున్నారనే తెలుస్తోంది. ఏది ఏమైనా తమ అభిమాన హీరో నటించబోయే సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకు బాలయ్య ఆ గుడ్‌ న్యూస్‌ చెప్పేదెప్పుడో? 

You May Like This
- Advertisment -spot_img

Most Popular