HomeMovie News Teluguమెగా అక్కినేని బంధం

మెగా అక్కినేని బంధం

స్టార్‌ హీరోలైన చిరంజీవి, నాగార్జున ఇద్దరూ మంచి మిత్రలన్న సంగతి తెలిసిందే. అసలు చిరంజీవిని సినిమాల్లోకి రమ్మని ప్రేరేపించిందే నాగార్జునట. అభిమానులతో పాటు, మళ్లీ మీరు సినిమాల్లోకి రావాలి అని నాగార్జున ఇచ్చిన ప్రోత్సాహమే ఎక్కువట. అంతేకాదు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాంకి చిరంజీవి ఒప్పుకోవడానికి కూడా నాగార్జునే బలమైన కారణమని చిరునే స్వయంగా చెప్పారు. అంతేకాదు వీరిద్దరూ మంచి బిజినెస్‌ పార్టనర్స్‌ కూడా.

‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా చేయడానికి చిరంజీవిని అభిమానులు ఎంతగా ప్రోత్సహించారో అంతకన్నా ఎక్కువే సినీ రంగం నుండి నాగార్జున వంటి మంచి మిత్రుని ప్రోత్సాహం కూడా అంతే ఉంది. తాజాగా చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ బుల్లితెర షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ షోకి స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చిన నాగార్జున చిరు పట్ల తనకున్న అభిమానాన్ని ఈ రకంగా తెలియజేశారు. అలాగే ఈ ఇద్దరు మిత్రలు బుల్లితెర సాక్షిగా ఒకరి పట్ట మరొకరికి తమ మనసులో ఉన్న అభిప్రాయాలను బయట పెట్టారు.

అలాగే చిరంజీవి కూడా నాగార్జున నటించిన ‘నమో వేంకటేశాయ’ చిత్రం చూశాననీ, చాలా బాగుందనీ ప్రశంసించారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు తనలో కూడా ఆ భక్తి భావాలు అలా పొంగిపొర్లిపోయాయని చిరు తెలిపారు. ఇక ఈ షో విషయానికొస్తే, చిరు రాకతో షోకి కొత్త కళ వచ్చింది. చాలా జోష్‌ వచ్చింది. సీనియర్‌ నటీమణులు చిరుతో చేసే సందడికి బుల్లితెరపై కోలాహలం మొదలయ్యింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular