HomeMovie News Teluguచైతూ - సామ్‌: చెప్పలేనంత ప్రేమ

చైతూ – సామ్‌: చెప్పలేనంత ప్రేమ

నాగచైతన్య, సమంత త్వరలో వైవాహిక బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ ప్రేమ జంటకు ఈ మధ్యనే ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగిపోయింది. టాలీవుడ్‌లో ఈ ఇద్దరి ప్రేమ గురించి సెపరేటుగా చెప్పక్కర్లేదు. గత కొంత కాలంగా వీరి ప్రేమ న్యూస్‌లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం. ఎంగేజ్‌మెంట్‌ అయిన తర్వాత వచ్చిన తొలి ప్రేమికుల దినోత్సవం రోజును ఈ ఇద్దరూ ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నారోగానీ, సమంత తనకు కాబోయే భర్త అయిన నాగచైతన్యను ప్రేమగా హగ్‌ చేసుకున్న మూమెంట్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుని ‘చెప్పలేనంత’ ప్రేమను చెప్పకనే చెప్పేసింది.

సమంత ఏం చేసినా అది హాట్‌ హాట్‌ న్యూసే. సోషల్‌ మీడియాతో తన ప్రతీ అనుభవం పంచుకుంటూ ఉంటుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌, స్పెషల్‌గా. అందుకే ఈ ఫొటో సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అయ్యింది. చైతూతో గోల్డెన్‌ మూమెంట్స్‌ని ఇప్పటికే పలు సందర్భాల్లో సమంత సోషల్‌ మీడియాకి ఎక్కించిన సంగతి తెలుసు కదా. ఆ లిస్టులో ఈ మూమెంట్‌ కూడా చేరిపోయింది. ఇక పెళ్లి లోపల ఇంకెన్ని గోల్డెన్‌ మూమెంట్స్‌ని సమంత అభిమానులతో పంచుకుంటుందో వేచి చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular