HomeMovie News Teluguమెగా కుమ్ముడు వర్సెస్‌ పవర్‌ కుమ్ముడు

మెగా కుమ్ముడు వర్సెస్‌ పవర్‌ కుమ్ముడు

‘కుమ్ముడు’లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్‌. మెగా హీరోస్‌ యూ ట్యూబ్‌లో ‘కుమ్మేస్తున్న’ తీరు తెలుగు సినీ వర్గాల్ని విస్మయానికి గురిచేస్తోందనడం నిస్సందేహం. 9 ఏళ్ళ తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి, వస్తూనే 100 కోట్లు కొల్లగొట్టి, కొత్త చరిత్రను లిఖించారు. యూ ట్యూబ్‌లో అయితే మెగాస్టార్‌ నటించిన ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా టీజర్‌, ట్రైలర్‌, ఆడియో సింగిల్స్‌, మేకింగ్‌, సాంగ్‌ టీజర్స్‌ ఇలా ప్రతీదీ అంచనాల్ని మించిన సంచలనాలనే సృష్టించడం చూశాం.

ఇప్పుడు యూ ట్యూబ్‌ కుమ్ముడులో తానేం తక్కువ తిన్లేదంటున్నాడు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌. తన తాజా చిత్రం ‘కాటమరాయుడు’తో యూ ట్యూబ్‌కి ‘పవర్‌ కింగ్‌’ తానేనని పవర్‌ స్టార్‌ నిరూపిస్తున్నాడు. 48 గంటలు పూర్తి కాకుండానే 44 లక్షల హిట్స్‌ సాధించింది ‘కాటమరాయుడు’ టీజర్‌. ఎంతమంది ఉన్నారని కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యమంటూ ‘కాటమరాయుడు’లో పవన్‌ పేల్చిన డైలాగ్‌ అభిమానుల్ని సూపర్బ్‌గా ఎట్రాక్ట్‌ చేసింది. పవన్‌ స్టైలింగ్‌ దగ్గర్నుంచి, బాడీ లాంగ్వేజ్‌ దాకా అన్నీ అద్భుతః అనే స్థాయిలో ఉన్నాయి.

తమిళ సినిమా ‘వీరం’ రీమేక్‌ అయినప్పటికీ కూడా దానిపై తనదైన ముద్ర వేశాడు పవన్‌కళ్యాణ్‌. ఇంకో వైపున అన్నయ్య చిరంజీవి కూడా రీమేక్‌తోనే 100 కోట్లు కొల్లగొట్టడంతో తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ కూడా రీమేక్‌తో 100 కోట్ల పైన వసూళ్ళు సాధిస్తాడని టాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్టులు అంచనా వేయడం జరుగుతోంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular