HomeMovie News Teluguపవన్‌ త్యాగం చేస్తాడా?

పవన్‌ త్యాగం చేస్తాడా?

త్రివిక్రమ్‌ – పవన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సి ఉంది. ఎప్పుడో ఈ సినిమా అనౌన్స్‌ అయిపోయింది. తాజాగా నిర్మాత, ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన సుబ్బిరామిరెడ్డి తాజాగా మెగా ఫ్యామిలీ సినిమాపై అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో ఆయన సినిమా చేయబోతున్నట్లు, ఆ సినిమాకి త్రివిక్రమ్‌ డైరెక్షన్‌ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఆల్రెడీ పవన్‌, త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమా సంగతేంటని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

అయితే ఈ సినిమాను పవన్‌ త్యాగం చేస్తాడా? లేక రెండూ చేసేస్తాడా? ఒకవేళ అది జరిగాలంటే ఎలా? అనే డైలమాలో ఉన్నారు అభిమానులు. ఏది ఏమైనా ఒక సినిమాని ఒప్పుకున్నాక దాన్ని మధ్యలో వదలండం సాధ్యం కాదు. ఆల్రెడీ పవన్‌తో సినిమా కోసం త్రివిక్రమ్‌ కథ సిద్ధం చేసి పెట్టుకున్నాడు. పవన్‌ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. ఈ సినిమా అయిపోగానే పవన్‌, త్రివిక్రమ్‌ సినిమా పట్టాలెక్కేయడం ఖాయం.

ఈ సినిమా తర్వాత పవన్‌ చేయాల్సిన మరో సినిమా కూడా లైన్‌లోనే ఉంది. తమిళ్‌ డైరెక్టర్‌ నేశన్‌ డైరెక్షన్‌లో ఆ సినిమా తెరక్కెనుంది. సో పవన్‌ డేట్స్‌ ఈ లోగా ఖాళీ లేవు. వీటిలో పవన్‌ ఏ సినిమాని త్యాగం చేస్తాడు? అనేది తాజా ప్రశ్న. సుబ్బిరామిరెడ్డి చెప్పిన దాని ప్రకారం త్వరలోనే తను అనౌన్స్‌ చేసిన కాంబినేషన్‌లో సినిమా రాబోతుందన్నారు. మరి పవన్‌ తన డేట్స్‌ ఎలా అడ్జస్ట్‌ చేసుకుంటాడో. చిరు, పవన్‌లతో త్రివిక్రమ్‌, సుబ్బిరామిరెడ్డి కలియికలో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular