HomeMovie News Teluguప‌వ‌న్ స్టామినా ఇదీ...!

ప‌వ‌న్ స్టామినా ఇదీ…!

హిట్సూ, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా… అభిమాన బ‌ల‌గాన్ని సంపాదించ‌డం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కే చెల్లింది. ప‌వ‌న్ గ‌త చిత్రం… స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఆ ప్ర‌భావం కొంచెం కూడా కాట‌మ‌రాయుడుపై ప‌డ‌క‌పోవ‌డం విశేషం.

తాజాగా కాట‌మ‌రాయుడు టీజ‌ర్‌కి వ‌స్తున్న స్పంద‌న‌, అది సాధిస్తున్న కొత్త రికార్డులే ఇందుకు సాక్ష్యం. టాలీవుడ్ టీజ‌ర్ రికార్డుల‌న్నీ కాట‌మ‌రాయుడు తిర‌గ‌రాస్తోంది. అతి త‌క్కువ టైమ్‌లోనే ప‌ది ల‌క్ష‌ల వ్యూస్ సొంతం చేసుకొన్న తెలుగు టీజ‌ర్‌గా కాట‌మ‌రాయుడు నిలిచింది.

అంతేకాదు.. వేగంగా పాతిక ల‌క్ష‌ల వ్యూస్ సాధించిన సినిమా కూడా కాట‌మ‌రాయుడే. టీజ‌ర్‌లో కొత్త‌ద‌నం ఏం లేక‌పోయిన‌ప్ప‌టికీ, ప‌వ‌న్‌కున్న ఇమేజ్‌, త‌న స్టామినా ఈ కాట‌మ‌రాయుడ్ని రికార్డుల రాయుడుగా నిలిపాయి. కాట‌మ‌రాయుడు ప్ర‌స్తుత స్కోరు దాదాపు 30 ల‌క్ష‌ల వ్యూస్‌కి ద‌గ్గ‌ర‌వుతోంది. మున్ముందు ఈ ప‌వ‌న్ సినిమా ఇంకెన్ని కొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular