HomeMovie News Teluguఅఖిల్‌ కొత్త సినిమా ఆలస్యం వెనుక..

అఖిల్‌ కొత్త సినిమా ఆలస్యం వెనుక..

అక్కినేని అందగాడు అఖిల్‌ పారాడే వయసులోనే ఓ సెన్సేషన్‌ సృష్టించేశాడు ‘సిసింద్రీ’ సినిమాతో. అయితే అదే సెన్సేషన్‌తో ప్రారంభమైన తొలి సినిమా ‘అఖిల్‌’తో ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోయాడు. తొలి సినిమానే పరాజయం పొందడంతో అఖిల్‌ నెక్స్ట్‌ సినిమా విషయంలో డెసిషన్‌ త్వరగా తీసుకోలేకపోయాడు. చాలా మంది డైరెక్టర్స్‌ని పరిశీలించి, తనను ముంందుగా తెలుగు తెరకు పరిచయం చేసిన విక్రమ్‌ కుమార్‌తో సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

‘మనం’ సినిమాలో అఖిల్‌ ఎంట్రీ సూపర్బ్‌గా చూపించిన విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌లోనే అఖిల్‌ రెండో సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ కాంబోలో ప్రాజెక్టు ఎప్పుడో ఓకే అయినా కానీ ఇంకా సెట్స్‌ మీదికి వెళ్లలేదు. ఇందుకు కారణం నాగార్జునేనట. విక్రమ్‌ తెచ్చిన కథలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయమని సూచించారట. దాంతో ఆ కథని పక్కన పెట్టేసి మరో కొత్త కథతో వచ్చాడట విక్రమ్‌ కుమార్‌. ఆ కథ నాగార్జునని బాగా ఇన్‌స్పైర్‌ చేయడంతో వెంటనే ఓకే చేసేశాడట.

నాగార్జునకి ‘శివ’ సినిమా తెచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆ తరహాలోనే ఇప్పుడు అఖిల్‌ చేయబోయే సినిమా ఉండబోతోందంటున్నాడు నాగార్జున. తొలి సినిమాతో నిరాశ పరిచిన అఖిల్‌ సెకండ్‌ సినిమాతో శభాష్‌ అనిపించుకోవడం పక్కా అని నాగార్జున భరోసా ఇస్తున్నారు. ఈ కారణాలతోనే అఖిల్‌ సినిమా లేట్‌ అయ్యిందనీ, ఇక త్వరలోనే సెట్స్‌ మీదికెళ్తుందనీ ఆయన చెప్పారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular