HomeMovie News Teluguసైకిల్ చైన్లు ప‌ట్టుకొని కొట్టుకొందాం రా!

సైకిల్ చైన్లు ప‌ట్టుకొని కొట్టుకొందాం రా!

ఓ హీరో మ‌రో హీరోని కొట్టుకొందాం రా అని పిలిచాడు. అదీ.. బ‌హిరంగ ఆడియో వేడుక‌లో. కాక‌పోతే.. స‌ర‌దాకే లెండి. పిలిచిన హీరో మంచు మ‌నోజ్ అయితే.. ఆహ్వానం అందుకొన్న‌ది మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌. వీరిద్ద‌రూ మంచి ఫ్రెండ్స్‌. క‌ల‌సి క్రికెట్ ఆడుకొంటుంటారు. చిన్న‌ప్ప‌టి ఆ స్నేహం ఇప్పుడు పెరిగి పెద్ద‌దైంది. ‘బాబాయ్‌..’ అంటే ‘ఏరా బాబాయ్’ అనుకొనేంత‌లా మారిపోయింది. వీరిద్ద‌రూ క‌ల‌సి ఓ సినిమా చేయ‌బోతున్నారు. 

ఆ విష‌య‌మే ‘గుంటూరోడు’ ఆడియో వేడుక ద్వారా బ్రేకింగ్ న్యూస్‌లా మారింది.  చిరంజీవి – మోహ‌న్ బాబు క‌ల‌సి `బిల్లా రంగా` అనే సినిమాలో న‌టించారు. అందులో చిరు, మోహ‌న్ బాబు ఇద్ద‌రూ ఓ ఫైట్‌లో క‌ల‌బ‌డి కొట్టుకొంటారు. అదే విష‌యాన్ని మ‌నోజ్ ఇలా స‌ర‌దాగా గుర్తు చేశాడు. ‘మ‌నోజ్ తో బిల్లా రంగా రీమేక్ చేయాల‌ని వుంది..’ అని సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాడు.

అప్పుడే మ‌నోజ్ కూడా స్పందించాడు. ‘అయితే రా బాబాయ్‌.. ఇద్ద‌రూ సైకిల్ చైన్లు ప‌ట్టుకొని కొట్టుకొందాం..’ అంటూ ఆ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ‘ఆ క‌థ‌ని డైరెక్ట్ చేయ‌గ‌లిగే కెపాసిటీ ఉన్న ద‌ర్శ‌కుడు దొరికితే.. నేను రెడీ బాబాయ్‌’ అనేశాడు మ‌నోజ్‌. సో.. త్వ‌ర‌లోనే మంచు – మెగా మ‌ల్టీస్టార‌ర్ చూడొచ్చ‌న్న‌మాట‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular