HomeMovie News Teluguచరణ్‌ సినిమాలో సమంతకి కెరీర్‌ బెస్ట్‌ రోల్‌?

చరణ్‌ సినిమాలో సమంతకి కెరీర్‌ బెస్ట్‌ రోల్‌?

చరణ్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా రొటీన్‌ కమర్షియల్‌ సినిమా కాదట. చాలా ప్రయోగాత్మకమైన సినిమా అట. ఈ సినిమాలో అత్యంత కీలకమైన లేడీ పాత్ర ఉందట. ఆ పాత్రని ఓ స్టార్‌ హీరోయిన్‌తో చేయించాలని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. సమంత అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని భావించి, ఆ పాత్ర కోసం సమంతని ఫైనల్‌ చేశారని సమాచారమ్‌. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌ హీరోలందరితోనూ జత కట్టి, ఆడి పాడిన సమంత ఇంతవరకు చరణ్‌తో సినిమా చేయకపోవడం విశేషం.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పెళ్లి సందడిలో పడి తెలుగులో సినిమాలకు సైన్‌ చేయడం లేదు. అయితే సుకుమార్‌ సినిమాలో ఛాన్స్‌ అనగానే ఎగిరి గంతేసిందట. అందులోనూ చరణ్‌తోనూ సినిమా చేసే ఛాన్స్‌ రావడంతో సమంత ఉబ్బితబ్బిబ్బవుతోంది. దాంతో తన వ్రతం పక్కన పెట్టి ఈ సినిమాకి సైన్‌ చేసేసిందని సమాచారమ్‌. వాస్తవానికి సమంతకు కాబోయే భర్త అయిన నాగచైతన్య నుండి గానీ, అక్కినేని ఫ్యామిలీ నుండి గానీ, ఇకపై సినిమాల్లో నటించకూడదనే షరతులు, ఆంక్షలు అయితే ఏమీ లేవు.

కానీ ఎందుకో సమంతే సినిమాలకు చిన్న గ్యాప్‌ తీసుకుంది ప్రస్తుతం. అయితే కెరీర్‌ బెస్ట్‌ రోల్‌ అనగానే సమంత తన హద్దుల్ని, పక్కన పెట్టేసి ఓకే చెప్పేసిందనీ ఇండస్ట్రీ వర్గాల సమాచారమ్‌. అసలింతకీ ఆ పాత్ర ఏంటి? అనేది సస్పెన్సే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular