HomeMovie News Teluguఅనుపమ చరణ్ సినిమా వదిలేయటానికి కారణం?!

అనుపమ చరణ్ సినిమా వదిలేయటానికి కారణం?!

అనుపమ పరమేశ్వరన్- ఈ  పేరు వారం క్రితం వరకు ఫిలిం నగర్ లో ఒక ఊపు ఊపింది. కాని ఏమైందో ఏమో తెలియదు కాని సడన్ గా అందరు తనని జాలిగా చూస్తున్నారు.

వివరాల్లోకి వస్తే, అనుపమని లీడ్ హీరోయిన్ గా రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో తీసుకునట్టుగా ఆఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. దీనితో అనుపమ దశ తిరిగిపోయిందని అంతా అనుకున్నారు. కాని అనుకోకుండా తను ఆ సినిమా నుండి బయటకు వచ్చేసింది అన్న వార్తలు సంచలనం రేపాయి.

దీనికి కారణం అనుపమ పెట్టిన కండిషన్స్ అని అలాగే రెమ్యునరేషన్ విషయంలో కూడా మొండి పట్టు పట్టడమే అని అందరు అనుకున్నారు. అయితే ఇవ్వన్ని తప్పుడు వార్తలు అని అనుపమ రెమ్యునరేషన్ ఇబ్బందుల వలన ఈ సినిమా వదిలేసింది అన్నవి ఒట్టి పుఖార్లు మాత్రమే అని మైత్రి మూవీ మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ బహిరంగ ప్రకటనతో అనుపమకి ఒక రకమైన రిలీఫ్ వచ్చినట్టయింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular