HomeMovie News Teluguమాస్ మహారాజ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట!!

మాస్ మహారాజ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట!!

స్వయంకృషితో హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో రవితేజ ఒకడు. కాని అమిందో తెలియదు ఒక సంవత్సర కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

ఈ సంవత్సరకాలంలో రవితేజ, సర్దార్ డైరెక్టర్ బాబీతో ఒక సినిమా చేయబోతున్నాడని అలాగే కొత్త డైరెక్టర్స్ తో చేస్తాడని చాలానే రూమర్స్ వచ్చాయి. కాని వీటిల్లో ఏది మొదలుకాలేదు. అయితే రేపు తన పుట్టినరోజు పురస్కరించుకొని తను చేయబోయే చిత్రాలని ప్రకటిస్తాడని తెలుస్తుంది.

అందులో ఒకటి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో అని ఈ మధ్యనే వార్తలు బయటకి వచ్చాయి. అయితే ఈ సస్పెన్స్ కి మాత్రం రవి తేజనే తెరదించాలి. ఇక ఈ ఆకస్మిక గ్యాప్ వెనుక ఉన్న కారణాలు కేవలం మంచి కధ దొరకకపోవడమే అని రవితేజ సన్నిహిత వర్గాల మాట.

చూద్దాం మరి మన మాస్ రాజా మళ్ళీ తన స్టైల్ మాస్ ని మనకి అందిస్తాడో లేదో!

You May Like This
- Advertisment -spot_img

Most Popular