HomeMovie News Teluguబన్నీ టార్గెట్‌ వంద కోట్లు

బన్నీ టార్గెట్‌ వంద కోట్లు

బన్నీ నటించిన ‘సరైనోడు’ సినిమా గతేడాది రికార్డు స్థాయిలో హిట్‌ అందుకుంది. ‘సరైనోడు’ సినిమాతో బీభత్సమైన వసూళ్లు సాధించి, 60 కోట్ల మార్క్‌ దాటేశాడు బన్నీ. ఈసారి అతని లక్ష్యం 100 కోట్లు అట. ‘గబ్బర్‌సింగ్‌’ ఫేం హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘డిజె – దువ్వాడ జగన్నాథం’ 100 కోట్ల మార్క్‌ అందుకునేలానే ఉంది. అంత పక్కా ప్లానింగ్‌తో సినిమాని రూపొందిస్తున్నారు.

మాస్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తూనే, క్లాస్‌ ఆడియన్స్‌ని మెప్పించేలా ఈ ‘డిజె’ని రూపొందించారట. ఇక బన్నీ డాన్సుల సంగతి చెప్పనే ఆక్కర్లేదు. సినిమా సినిమాకీ ఏదో ఒక కొత్త డాన్సు స్టెప్పుల్ని పరిచయం చేస్తూ ఉంటాడు. అలాగే ఈ సినిమాతో కూడా డాన్సుల్లో కొత్తదనం కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడట. కొరియోగ్రాఫర్లు కూడా బన్నీ చేత కొత్త కొత్తగా స్టెప్పులేయించడానికి ఉత్సాహం చూపిస్తున్నారట. ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాతో ఆల్‌ టైం రికార్డునందుకున్న డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఈ సినిమాతోనూ మరో మెగా రికార్డుకు శ్రీకారం చుట్టేలానే ఉన్నాడట.

సమ్మర్‌ అల్లు అర్జున్‌కి బాగా కలిసొచ్చిన సీజన్‌. సో ఈ సినిమాని కూడా సమ్మర్‌లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్‌ సరసన ఈ సినిమాలో ‘ముకుందా’ సినిమాతో గోపికగా అలరించిన ముద్దుగుమ్మ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular