HomeMovie News Teluguఅన్నయ్యకి విషెస్‌ చెప్పిన పవన్‌

అన్నయ్యకి విషెస్‌ చెప్పిన పవన్‌

చిరంజీవి రీ ఎంట్రీలో వస్తోన్న సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఈ రోజు గుంటూరులో జరగబోతోంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ వేడుకకు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చీఫ్‌ గెస్ట్‌గా రానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ లోగా అన్నయ్య రీ ఎంట్రీలో వస్తోన్న ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తూ అన్నయ్యకి బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తూ పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్‌ చాలా సంతోషపడ్డారు.

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. సో సమయానికి ఈ ఫంక్షన్‌కి హాజరు కావడం అవుతుందో లేదో తెలీదు. కానీ తన విషెస్‌ని మాత్రం ముందుగా పంపించాడు. అన్నదమ్ముల మధ్య తగాదాలున్నాయంటూ భావించే వ్యక్తులకి, చక్కర్లు కొట్టే గాసిప్స్‌కి ఈ మెసేజ్‌ ఓ సమాధానం కానుందనే చెప్పొచ్చు. ఈ ఫంక్షన్‌కి గుంటూరులోని హాయ్‌లాండ్‌ వేదిక అయ్యింది. వేలాది మంది అభిమానులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ వేడుకకి హాజరవుతారనే ఉద్దేశ్యంతో భారీగా ఏర్పాట్లు చేశారు.

మెగాస్టార్‌ కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. రైతు సమస్యల నేపధ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి వినాయక్‌ దర్శకుడు కాగా, రామ్‌ చరణ్‌ నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular