HomeMovie News Teluguసల్మాన్‌ఖాన్‌ సరసన నితిన్‌ హీరోయిన్‌

సల్మాన్‌ఖాన్‌ సరసన నితిన్‌ హీరోయిన్‌

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘ట్యూబ్‌ లైట్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇటీవల ‘సుల్తాన్‌’ సినిమాతో సల్మాన్‌ భారీ విజయం అందుకున్నాడు. ఈ సినిమాపై అంతకుమించిన అంచనాలున్నాయి. ఈ సినిమాలో చైనా భామ జూజూ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మరో హీరోయిన్‌ ఈ సినిమాకి ఎంపికయ్యింది.

ఆమె ఎవరో కాదు తెలుగులో నితిన్‌ సరసన ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలో నటించింది. ఆ ముద్దుగుమ్మే ఇషా తల్వార్‌. తెలుగులో ఈ సినిమాలో నటించిన తర్వాత మలయాళ చిత్రాల్లో వరుసగా నటిస్తోంది. గతంలో హిందీలోనే ఓ చిత్రంలో నటించింది. సైఫ్‌ అలీఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘ఛప్‌’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించింది. అయితే ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా శోభితా ధూళిపాల నటించగా, సెకండ్‌ హీరోయిన్‌గా ఇషా తల్వార్‌ నటించింది.

సల్మాన్‌ సినిమాలో వచ్చిన ఈ తాజా ఆఫర్‌కి అమ్మడు తెగ ఆనంద పడిపోతోందట. ఎందుకంటే సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో ఒక్కసారి నటిస్తే చాలు ఆ హీరోయిన్‌ దశ తిరిగిపోయినట్లే. ముద్దుగుమ్మలు కత్రినా కైఫ్‌, ఆశిన్‌, ఐశ్వర్యారాయ్‌ కూడా ఈ కోవలో సక్సెస్‌ అయిన భామలే. అలాగే ఈ భామ కూడా ఇక బాలీవుడ్‌లో సత్తా చాటేయడానికి రెడీ అయిపోయినట్లే అనుకుంటున్నారంతా. సల్మాన్‌ఖాన్‌ అంటే ఏదో జస్ట్‌ హీరో కాదు. హీరోయిన్స్‌ పాలిట గాడ్‌ ఫాదర్‌ మరి. దటీజ్‌ సల్మాన్‌ ఖాన్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular