HomeMovie News Teluguఎన్టీఆర్ కోసం బాలీవుడ్ బ్యూటీ 'కాజోల్' వస్తోందా ?

ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ బ్యూటీ ‘కాజోల్’ వస్తోందా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ‘డ్రాగన్’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’, వార్ 2 లాంటి పాన్ ఇండియా హిట్స్ తరువాత చేస్తున్న మూవీ డ్రాగన్. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ తర్వాత నీల్ కూడా చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే. నీల్ కచ్చితంగా డ్రాగన్ కోసం మరొక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాడని ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు.

డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ కి జోడీగా రుక్మిణీ వసంతన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా డ్రాగన్ నుంచి ఇంకొక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్రాగన్ మూవీని బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా మలిచేందుకు నీల్ చాలా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం స్పెషల్ గా బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్ ని కూడా రంగంలోకి దించుతున్నాడట. కథలో ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ ప్లాన్ చేసి, దీనికోసం పవర్ ఫుల్ గెస్ట్ రోల్ క్రియేట్ చేసాడట. కథకి ఈ రోల్ చాలా కీలకమని, నిడివి తక్కువ అయినా, ఈ పాత్ర ఇంపాక్ట్ స్ట్రాంగ్ గా ఉంటుందని ఇన్ సైడ్ వర్గాల టాక్.

అందుకే ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో కాజోల్ అయితే పర్ఫెక్ట్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందని నీల్ ఆలోచిస్తున్నారట. కాజోల్ నటన, స్క్రీన్ ప్రెజన్స్ ఆ పాత్రకు సూట్ అవుతాయని కాజోల్ ని ఎలాగైనా ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడట. బాలీవుడ్ భామలు ఇప్పుడిప్పుడే సౌత్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే దీపికా, ప్రియాంకా, కత్రినా, ఆలియా తెలుగులో నటించగా, సీనియర్ భామలు రవీనా, శిల్పా తప్ప పెద్దగా తెలుగులో ఎవరూ నటించలేదు. ఇప్పుడు కాజోల్ తెలుగు సినిమాలో భాగం అవుతోంది. కాజోల్ తమిళంలో రఘువరన్ బీటెక్ 2 లో నటించింది. తెలుగులో ఇప్పుడు NTR తో కలిసి నటిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular