HomeMovie News Telugu‘రెబల్ సాబ్’ సాంగ్ దుమ్మురేపింది.. మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టిన ప్రభాస్..!

‘రెబల్ సాబ్’ సాంగ్ దుమ్మురేపింది.. మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టిన ప్రభాస్..!

ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ హైదరాబాద్‌లో అభిమానుల సందడితో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. తమన్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్‌లో ప్రభాస్ డాన్స్, స్టైల్, ఎనర్జీ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. పాట విడుదలతో సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది.

ఆదివారం విడుదలైన ఈ పాట కోసం హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌లో ప్రత్యేక ఫ్యాన్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ మళ్లీ మాస్ డ్యాన్స్ చేస్తూ కనిపించడంతో అభిమానులు పండగలా జరుపుకున్నారు.

పాట వీడియో ప్లే చేయగానే థియేటర్ మొత్తం రభసగా మారింది. ఫ్యాన్స్ “రెబల్ స్టార్ ప్రభాస్” అంటూ నినాదాలు చేస్తూ, ఫ్లాగ్లు ఊపుతూ సందడి చేశారు. థియేటర్ బయట కూడా అభిమానులు భారీగా డ్యాన్స్‌లు చేస్తూ సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నారు.

ఈ ఈవెంట్‌కు దర్శకుడు మారుతి, నిర్మాతలు టీ.జీ. విశ్వప్రసాద్, వివేక్ కుచిబొట్ల, ఇషాన్ సక్సేనా, సినిమాటోగ్రాఫర్ తదితరులు హాజరయ్యారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటలో మాస్ బీట్స్, ఎనర్జిటిక్ మ్యూజిక్, కలర్‌ఫుల్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.

తమన్ మాట్లాడుతూ.. ‘రెబల్ సాబ్’ అనేది ప్రభాస్ గారికి మా గౌరవం. ఆయన స్వాగ్, స్టైల్‌ను ఫ్యాన్స్ ఎప్పుడూ ప్రేమిస్తారు. ఆ ఫీల్‌ను ఈ పాటలో రిఫ్లెక్ట్ అయ్యేలా చేశాం. ఇది సాధారణ సాంగ్ కాదు, అభిమానులకు ఒక ప్రత్యేక మెమరీ అవుతుంది” అని తెలిపారు.

పాటలో ప్రభాస్ పాత సినిమాల ఫొటోలు చూపించడంతో అభిమానుల్లో నాస్టాల్జియా కూడా పుట్టింది. ఆయన డాన్స్, ఎక్స్‌ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.

సోషల్ మీడియాలో ‘రెబల్ సాబ్’కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే పాట లక్షల్లో వ్యూస్ సాధించగా, అభిమానులు ఇది ప్రభాస్‌కు మరో బిగ్ హిట్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.

మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘ది రాజా సాబ్’ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవై ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతోంది. ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, సంజయ్ దత్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ హారర్ మాస్ ఎంటర్‌టైనర్ జనవరి 9న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. కొత్త సంవత్సరం – సంక్రాంతి సీజన్‌కు ప్రభాస్ అభిమానులకు ఇది భారీ గిఫ్ట్‌గా మారనుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular