HomeMovie News Teluguరాజమౌళిపై ట్రోలింగ్‌కు హైపర్ ఆది కౌంటర్.. బాలయ్య మాట్లాడినా బన్నీ నవ్వినా ట్రోలింగే..!

రాజమౌళిపై ట్రోలింగ్‌కు హైపర్ ఆది కౌంటర్.. బాలయ్య మాట్లాడినా బన్నీ నవ్వినా ట్రోలింగే..!

దర్శకధీరుడు రాజమౌళిపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ తీవ్రంగా కొనసాగుతోంది. హనుమంతుడిని అవమానించారన్న ఆరోపణలతో కొన్ని హిందూ సంఘాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేసాయి.

ఈ నేపథ్యంలో రాజమౌళికి బలమైన సపోర్ట్‌గా నిలిచారు హైపర్ ఆది. వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి హనుమంతుడిపై మాట్లాడిన విధానాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, అవమానించే ఉద్ధేశం ఏ మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఒక సినిమా రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన హైపర్ ఆది, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి రాజమౌళి అని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై కూడా ఇప్పుడు అనవసరంగా ట్రోలింగ్ జరుగుతుండడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హనుమంతుడి గురించి ఎక్కడా రాజమౌళి తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేసిన ఆది, కొంత మంది వివాదాన్ని పెద్దది చేసి రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

అదే సమయంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో ట్రోలింగ్ ఎలా పెరిగిందో కూడా ఉదాహరణలతో చెప్పారు. సినిమా కోసం ఎన్టీఆర్ సన్నబడితే ట్రోలింగ్, బాలకృష్ణ మాట్లాడితే ట్రోలింగ్, అల్లు అర్జున్ నవ్వినా ట్రోలింగ్.. ఇలా ఏ విషయం అయినా విమర్శలకే గురవుతోందని అసహనం వ్యక్తం చేశారు.

సాయి దుర్గ తేజ్ యాక్సిడెంట్ వల్ల మాట్లాడలేకపోయినా ట్రోలింగ్, ప్రభాస్ లుక్స్‌పై ట్రోలింగ్, రామ్ చరణ్ ‘చికిరి’ పాటపైనా ట్రోలింగ్ జరుగుతోందని ఆది ఫైర్ అయ్యారు.

సినిమా వాళ్లకు గౌరవం ఇవ్వాలని, అనవసరమైన ట్రోలింగ్ ఆపాలని ఆయన కోరారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular