HomeMovie News Teluguనేను అలా మాట్లాడకూడదు.. దయచేసి నన్ను క్షమించండి.. నిర్మాత రాజేష్ దండ

నేను అలా మాట్లాడకూడదు.. దయచేసి నన్ను క్షమించండి.. నిర్మాత రాజేష్ దండ

సినిమా ప్రమోషన్ల సమయంలో దర్శకులు, నిర్మాతలు కొన్ని వ్యాఖ్యలు చేసి వివాదాలు సృష్టించడం తరచూ జరుగుతుంటుంది. అదే తరహాలో ఇటీవల ‘కె-ర్యాంప్’ (K-Ramp) చిత్ర నిర్మాత రాజేష్ దండ (Rajesh Danda) చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి.

సినిమా వేగంగా దూసుకెళ్తున్న సమయంలో, ఒక వెబ్‌సైట్ నెగటివ్ ప్రచారం చేసిందని భావించి, ఓ ఈవెంట్‌లో రాజేష్ దండ ఆగ్రహంగా మాట్లాడారు. అయితే ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాక, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కి కూడా ఈ విషయం మీద ఫిర్యాదులు వెళ్లాయి.

తాజాగా జరిగిన ‘కె-ర్యాంప్’ సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా రాజేష్ దండ తన తప్పును అంగీకరించారు. “గత ప్రెస్‌మీట్‌లో నేను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. వారికీ నేను హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. నేను ఉపయోగించిన పదజాలం తప్పుగా ఉందని నా స్నేహితులు కూడా చెప్పారు. ఆ రోజు నేను అలా మాట్లాడకూడదు. మీడియా వారికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఛాంబర్‌కి ఇచ్చిన లేఖలో కూడా కొన్ని తప్పులు జరిగాయి. ఇతర వెబ్‌సైట్ల గురించి నేను చెప్పిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను” అని ఆయన వెల్లడించారు.

ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ.. “తప్పు చేసిన తర్వాత క్షమాపణ చెప్పడం మంచిదే కానీ, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకసారి ఆలోచించాలి” అని సూచిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular