HomeMovie News Teluguథియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి రాబోతున్న 'కాంతార: చాప్టర్ 1'..

థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి రాబోతున్న ‘కాంతార: చాప్టర్ 1’..

సినిమా ఎంత పెద్ద హిట్ అయినా, ఈ మధ్య ఓటీటీలో త్వరగానే అందుబాటులోకి వస్తోంది. కొన్నిసార్లు ఇంకా థియేటర్లలోనే ఆడుతుండగానే డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతోంది. ఇప్పుడు అలాంటి సెన్సేషన్ సృష్టించిన సినిమా ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) కూడా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం, సూపర్ హిట్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, రూ.1000 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తోంది.

ఇప్పుడే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను స్ట్రీమింగ్ కోసం సిద్ధం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. “The Legend Continues” అంటూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. అయితే విడుదల తేదీని మాత్రం వెల్లడించలేదు.

తాజా సమాచారం ప్రకారం, ‘కాంతార: చాప్టర్ 1’ ఈ నెల అక్టోబర్ 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోందని తెలుస్తోంది. హిందీ వెర్షన్ మాత్రం కొన్ని వారాల తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కాంతార ఓటీటీ రిలీజ్ వార్త తెలుసుకున్న సినీప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం “రూ.1000 కోట్ల మార్క్‌ చేరుకున్న తర్వాత రిలీజ్ అయి ఉంటే బాగుండేది” అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular