HomeMovie News Teluguమెగా ఫ్యామిలీలో మరో శుభవార్త.. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉపాసన..!

మెగా ఫ్యామిలీలో మరో శుభవార్త.. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉపాసన..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల మళ్లీ తల్లి కాబోతున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెగా అభిమానుల్లో ఈ వార్త ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఈ వార్తకు మరింత బలం చేకూర్చింది. ఆ వీడియోలో దీపావళి సందర్భంగా జరిగిన సీమంతం (బేబీ షవర్) వేడుకల దృశ్యాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉపాసనకు ఆశీస్సులు అందించి, బహుమతులు ఇస్తూ కనిపించారు.

ఈ వీడియోకి ఉపాసన ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తికరంగా ఉంది. “ఈ దీపావళి వేడుక రెట్టింపు ఆనందం, రెట్టింపు ప్రేమ, రెట్టింపు ఆశీర్వాదాలతో నిండిపోయింది” అని రాసింది. వీడియో చివర్లో “న్యూ బిగినింగ్స్” అని పేర్కొనడం, త్వరలోనే మెగా ఫ్యామిలీ మరో శుభవార్త చెప్పబోతుందనే సంకేతాలుగా మారింది.

రామ్ చరణ్–ఉపాసన దంపతులకు వివాహమైన పదకొండు సంవత్సరాల తర్వాత, 2023 జూన్‌లో కూతురు క్లీంకార కొణిదెల జన్మించింది. క్లీంకార రాకతో మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఉపాసన మరోసారి తల్లి కాబోతుందనే వార్తతో ఆనందం రెట్టింపు అయింది.

గతంలో ఒక ఇంటర్వ్యూలో ఉపాసన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. “మొదటి బిడ్డ విషయంలో చాలా ఆలస్యం చేశాం. కానీ రెండో బిడ్డ విషయంలో అలాంటి పొరపాటు చేయదలిచలేదు. నా ఆరోగ్యం, నా నిర్ణయం ముఖ్యం. మా డాక్టర్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అప్పుడే సిద్ధమవుతాను” అని ఆమె స్పష్టం చేశారు.

మహిళల ఎంపిక, ఆరోగ్యంపై ఉపాసన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పుడు రెండో బిడ్డ ప్లానింగ్‌పై ఉపాసన చూపుతున్న ఉత్సాహం మెగా అభిమానులను మరింత ఆనందపరుస్తోంది. ఈసారి “జూనియర్ రామ్ చరణ్” పుట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular