HomeMovie News Teluguగీతా ఆర్ట్స్ సర్ప్రైజ్.. ప్రభాస్ బర్త్‌డేకు పవర్‌ఫుల్ ట్రిబ్యూట్ వీడియో రిలీజ్!

గీతా ఆర్ట్స్ సర్ప్రైజ్.. ప్రభాస్ బర్త్‌డేకు పవర్‌ఫుల్ ట్రిబ్యూట్ వీడియో రిలీజ్!

రెబల్ స్టార్ ప్రభాస్ నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ ప్రభాస్‌కు ప్రత్యేక గిఫ్ట్‌గా ఒక మ్యాష్‌అప్ వీడియోను విడుదల చేసింది. వీడియోలో ప్రభాస్ చేసిన సినిమాల క్లిప్స్‌తో పాటు పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ డైలాగ్స్‌ను జోడించి ఆకట్టుకునేలా రూపొందించారు. “అర్జునుడి లాంటి రూపం.. భీముడి లాంటి బలం” అంటూ సాగిన ఈ వీడియో అభిమానులను ఎంతో ఆకర్షిస్తోంది.

దీంతో గీతా ఆర్ట్స్ ప్రత్యేక వీడియో రిలీజ్ చేయడంతో ప్రభాస్‌తో కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ప్రారంభమవుతుందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటివరకు అల్లు అరవింద్ లేదా బన్నీ వాస్ తరఫున అధికారిక ప్రకటన ఏమీ లేకపోయినా, ఈ కాంబినేషన్ రాబోయే కాలంలో రియాలిటీ అవుతుందనే ఆశతో ఫ్యాన్స్ ఉన్నారు.

ఇదిలా ఉంటే, బర్త్‌డే బాయ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన రాజాసాబ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రంలో నటిస్తున్నాడు. వీటితో పాటు సలార్ 2, హనురాఘవపూడి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ కూడా సెట్స్‌పై ఉండబోతోంది.

ప్రభాస్ కెరీర్‌లోని ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. ఈ బర్త్‌డే సందర్భంగా ఆయనపై ప్రేమ, క్రేజ్ ఎంత ఉందో మరోసారి రుజువైంది. గీతా ఆర్ట్స్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ వీడియో, అభిమానులకు ఒక అందమైన గిఫ్ట్‌గా నిలిచింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular