టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘జాతి రత్నాలు’ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నవీన్, చేసే ప్రతి సినిమాలో కామెడీతో పాటు కొత్తదనం చూపిస్తుంటారు.
ఇప్పుడు ఆయన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో కొనసాగుతోంది.
దీపావళి పర్వదినం సందర్భంగా సినిమా యూనిట్ ఒక స్పెషల్ ప్రోమోను విడుదల చేసింది. అందులో నవీన్ పోలిశెట్టి టపాకాయలు అమ్ముకునే వ్యక్తిగా కనిపించారు. ఆ వీడియోలో నవీన్ స్టైల్, టైమింగ్, హాస్య ధోరణి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఎలాన్ మస్క్, ప్రధాని నరేంద్ర మోదీ పేర్లను చమత్కారంగా ఉపయోగించిన తీరు హైలైట్ అయింది.
దాంతో ఈ ప్రమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీపావళి బాంబుల్లా నవీన్ పోలిశెట్టి కామెడీ టపాకాయలు పేలుతున్నాయి అంటున్నారు నెటిజన్లు.





