జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికను నవంబర్ 11న నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది.
ఈ మేరకు నోటిఫికేషన్ ఈ నెల13న విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలు చివరి తేదీ ఈ నెల 21గా నిర్ణయించారు. 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. అదే రోజు పోటీదారుల తుది జాబితా విడుదల చేయనున్నారు.
బ్రేకింగ్ న్యూస్
— Volga Times (@Volganews_) October 6, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
నవంబర్ 11వ తేదీ పోలింగ్, 14వ తేదీ కౌంటింగ్#JubileeHillsByPoll #LatestNews pic.twitter.com/7GRF7Uoeng
ఈ రోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వివిధ శాసనసభ స్థానాల కోసం ఉప ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది. ఆ జాబితాలో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా విడుదలైంది.
గత ఎన్నికల్లో ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన అనారోగ్యంతో జూన్ 8న మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక తప్పనిసరైంది.
ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే గోపినాథ్ భార్య సునీతను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం ప్రారంభించింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లు హైకమాండ్‌కు పంపారు. వీరిలో ఒకరిని పార్టీ రెండు రోజుల్లో తుది అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉంది.





