భుజానికి సర్జరీ విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో కీలక సందేశం ఇచ్చారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కిమ్స్ ఆస్పత్రిలో బుధవారం ఆయనకు భుజానికి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా పూర్తైనట్లు వైద్యులు వెల్లడించారు.
సర్జరీ అనంతరం తన ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ స్వయంగా స్పందించారు. అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అందుతున్న ప్రేమ, ప్రార్థనలు, మద్దతు తనను ఎంతో భావోద్వేగానికి గురిచేశాయని తెలిపారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు.
కిమ్స్ వైద్య బృందానికి ఎన్టీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రేమ ప్రతిరోజూ తనకు ఎంతో బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే అందరినీ కలుస్తానంటూ అభిమానులకు భరోసా ఇచ్చారు.
ఎన్టీఆర్ ఆరోగ్యంపై తాజా సమాచారం రావడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ‘అన్నా.. నువ్వు త్వరగా కోలుకోవాలి’, ‘నీ కోసం ఎంతో ఎదురుచూస్తున్నాం’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఆయనకు త్వరగా పూర్తి ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు.
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
— Jr NTR (@tarak9999) August 12, 2026
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon!…





