HomeMovie News Teluguజన నాయగన్‌కు షాకింగ్ ఓపెనింగ్స్..

జన నాయగన్‌కు షాకింగ్ ఓపెనింగ్స్..

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలుత సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి, చివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే విడుదలైన తొలి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ నమోదు చేయలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, భారత్‌లో తొలి రోజు సుమారు రూ.48.27 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.78.27 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ కలెక్షన్లతో విజయ్ గత చిత్రాలైన లియో, బీస్ట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) తొలి రోజు వసూళ్లను కూడా ‘జన నాయగన్’ అధిగమించలేకపోయిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సినిమా విడుదల ఆలస్యం కావడం, విడుదలకు ముందే హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం, కథపై మిశ్రమ స్పందన రావడం వంటి అంశాలు కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రం తెలుగులో వచ్చిన ఓ హిట్ సినిమాకు రీమేక్ అనే ప్రచారం కూడా కొంత ప్రభావం చూపిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించారు. మమితా బైజు కీలక పాత్రలో నటించారు. వీకెండ్‌లో ఈ సినిమా కలెక్షన్లు పుంజుకుంటాయా? లేక తొలి రోజు ప్రభావమే కొనసాగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular