HomeMovie News Teluguమూడేళ్లు ఎదురు చూశారు.. ఈసారి హిట్ పక్కా!

మూడేళ్లు ఎదురు చూశారు.. ఈసారి హిట్ పక్కా!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. జూలై 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన లెనిన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అఖిల్ అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా సినిమా వచ్చి మూడేళ్లు అయింది. అంత కాలం నాపై నమ్మకం ఉంచి ఎదురుచూసిన అభిమానులందరికీ ధన్యవాదాలు. మీ అందరినీ ఇంతకాలం వేచి చూడాల్సి వచ్చినందుకు క్షమించండి అని అఖిల్ అన్నారు.

అలాగే.. ‘ఈ రోజు నేను ఎక్కువగా మాట్లాడను. రిలీజ్ రోజు నా సినిమానే మాట్లాడుతుంది. గత రెండు రోజులుగా నిద్రపోలేదు. అయినా మీ అందరినీ చూసిన వెంటనే కొత్త ఉత్సాహం వచ్చింది’ అంటూ అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో వచ్చిన సినిమాలన్నింటికంటే లెనిన్ పూర్తిగా భిన్నమైన చిత్రమని, ఈసారి ప్రేక్షకులు ఆశించే స్థాయి వినోదాన్ని అందిస్తామని అఖిల్ ధీమా వ్యక్తం చేశారు.

ఈసారి తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటాం అంటూ అఖిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో లెనిన్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular