HomeMovie News Teluguరాజు వెడ్స్ రాంబాయి దర్శకుడితో సుమంత్ ప్రభాస్..

రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడితో సుమంత్ ప్రభాస్..

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త దర్శకులు పరిచయమవుతున్నప్పటికీ, తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకునే వారు చాలా కొద్దిమందే. అలాంటి దర్శకుల్లో సాయిలు కంపాటి ఒకరు. ఆయన తెరకెక్కించిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

ఈ సినిమా తర్వాత సాయిలు కంపాటి తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొనగా, తాజాగా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్‌పై ఏసియన్ సునీల్, రామ్ మోహన్ రావు నిర్మించనున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ స్వరాలు అందించనున్నారని తెలుస్తోంది. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిలు కంపాటి.. రాజు వెడ్స్ రాంబాయి కథను మొదట సుమంత్ ప్రభాస్‌కే వినిపించినట్లు వెల్లడించారు. కథ నచ్చినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో ఆ సినిమా చేయలేకపోయారని చెప్పారు. ఇప్పుడు అదే దర్శకుడు, హీరో కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతుండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular