HomeMovie News Teluguఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ పోస్టర్‌పై ట్రోల్స్..

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ పోస్టర్‌పై ట్రోల్స్..

ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ప్రాజెక్ట్‌కు ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని పురాణాల ఆధారంగా రూపొందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ను విడుదల చేస్తూ.. శివుడి కుమారుడు.. పార్వతీదేవికి గర్వకారణం.. దేవసేనాని.. మరోసారి త్రివిక్రమ్‌తో అంటూ ఆసక్తికర క్యాప్షన్‌ను పంచుకున్నారు. అయితే సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదలైన పోస్టర్‌పై సోషల్ మీడియాలో మిక్స్‌డ్ రియాక్షన్స్ వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు పోస్టర్ విజువల్స్‌ను ప్రశంసిస్తుండగా, మరికొందరు అది ఏఐ (AI) సహాయంతో రూపొందించినట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ప్రకటనకు మరింత గ్రాండ్ లుక్ లేదా ప్రత్యేక కాన్సెప్ట్ వీడియో విడుదల చేసి ఉంటే బాగుండేదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ఇది కేవలం అనౌన్స్‌మెంట్ పోస్టర్ మాత్రమేనని, టీజర్ లేదా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత పూర్తి స్థాయిలో అంచనా వేయాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌పై భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular