నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు అధికారిక టైటిల్ ప్రకటించకపోవడంతో ‘NBK112’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ వేడుక వివరాలను చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. జూన్ 25, 2026 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటపాలెం టిటిడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు హెచ్ఆర్డీ శాఖ మంత్రి నారా లోకేష్, పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్లో A Powerful Combo, An Exciting Beginning అనే ట్యాగ్‌లైన్‌ను ఉపయోగించగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్ తొలిసారి కలిసి వస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రారంభోత్సవం తర్వాత నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.






