HomeMovie News TeluguOG-2 స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం..

OG-2 స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ (OG)’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఇప్పుడు సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. తాజాగా ‘OG యూనివర్స్’కు సంబంధించిన చర్చలు అధికారికంగా ప్రారంభమైనట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుజీత్, పవన్ కళ్యాణ్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫొటోలు విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా పవన్ అభిమానులు #OG2 హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. OG కథను మరింత విస్తరించేలా సీక్వెల్, ప్రీక్వెల్ అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కథలోని కీలక పాత్రలు, బ్యాక్‌స్టోరీలు, యూనివర్స్ విస్తరణకు సంబంధించిన అంశాలను ప్రస్తుతం టీమ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇక OG చిత్ర నిర్మాణ సమయంలో ఎదురైన ఆలస్యాలు సీక్వెల్ విషయంలో జరగకుండా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సుజీత్, తమన్ ఇప్పటికే OG-2 కోసం ఐడియాలపై చర్చలు ప్రారంభించడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular