HomeMovie News Teluguపెద్ది సెట్స్‌లో మెగాస్టార్ సందడి.. రన్‌టైమ్ అప్‌డేట్ వైరల్

పెద్ది సెట్స్‌లో మెగాస్టార్ సందడి.. రన్‌టైమ్ అప్‌డేట్ వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోగా, తాజాగా దర్శకుడు బుచ్చిబాబు షేర్ చేసిన BTS వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సుకుమార్ కలిసి ‘పెద్ది’ షూటింగ్ సెట్స్‌ను సందర్శించారు.

షూటింగ్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించిన చిరంజీవి.. రామ్ చరణ్ లుక్, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్‌ను చూసి ప్రశంసించినట్లు తెలుస్తోంది. యూనిట్ సభ్యులతో ఆయన సరదాగా గడిపిన క్షణాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బుచ్చిబాబు షేర్ చేసిన పోస్టులో.. ‘మన హృదయానికి దగ్గరగా ఉండే కొన్ని BTS క్షణాలు ఇవి. ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రీమియర్స్ ప్రారంభమవుతాయి. ట్రైలర్ అప్‌డేట్ త్వరలో వస్తుంది’ అని పేర్కొన్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘పెద్ది’ చిత్రం ఏకంగా 3 గంటల 20 నిమిషాల నిడివితో రాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ నెల 17న ట్రైలర్ విడుదల చేసే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.

ఈ రన్‌టైమ్ చూసి కొందరు ఆశ్చర్యపోతుండగా, మరికొందరు మాత్రం బుచ్చిబాబు కంటెంట్‌పై నమ్మకంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి, ‘పెద్ది’ రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై హైప్ మరింత పెరుగుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular