HomeMovie News Teluguచిరంజీవి '2+1' మెగా ప్లానింగ్‌!

చిరంజీవి ‘2+1’ మెగా ప్లానింగ్‌!

మెగాస్టార్‌ చిరంజీవి 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’తో గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇచ్చి, బాక్సాఫీస్‌ వద్ద 100 కోట్లు కొల్లగొట్టి, బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అనిపించాడు. ఇక తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘సైరా నరసింహారెడ్డి’తో అల్టిమేట్‌ హిట్‌ కొట్టి, దటీజ్‌ మెగాస్టార్‌.. అనిపించుకున్నాడు. అయితే, ఈ రెండు సినిమాలు చిరంజీవికి రీ ఎంట్రీలో జస్ట్‌ టీజర్‌, ట్రైలర్స్‌లాంటివి మాత్రమే. అసలు సినిమా ముందుంది. వరుసగా చిరంజీవి సినిమాలు చేయాలనుకుంటున్నాడు. ఆ క్రమంలో ఇప్పటికే రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

దసరా సందర్భంగా, కొరటాల శివతో చిరంజీవి చేయబోయే సినిమా స్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. కొరటాల సినిమా తర్వాత చిరంజీవి త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నాడు. ఈ రెండూ పక్కా కమర్షియల్‌ సినిమాలు. జస్ట్‌ లుక్‌ టెస్ట్‌గా వచ్చిన ‘ఖైదీ’తోనే కోట్లు కొల్లగొట్టేశాడు. కమర్షియాలిటీకి పూర్తి భిన్నంగా ‘సైరా నరసింహారెడ్డి’ చేసి ఇదీ చిరంజీవితం అంటే అనిపించాడు. ఇక ఇప్పుడు కమర్షియల్‌ కంటెంట్‌తో వస్తూ, ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో ఊహించడమే కష్టం.

ఇదిలా ఉంటే, ఈ రెండు సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా దాదాపు ‘సైరా నరసింహారెడ్డి’ తరహాలోనే ఉంటుందట. అంటే బడ్జెట్‌లో అంత భారీతనం కాకపోయినా, విలక్షణ చిత్రమై ఉంటుందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. అయితే, ఆ ప్రాజెక్ట్‌ని టేకప్‌ చేసే దర్శకుడెవరన్నది ఇంకా చెప్పలేం. కానీ, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏడాదికి రెండు సినిమాలు కాకపోయినా, ఏడాదికో సినిమాని చిరంజీవి నుండి నిస్సందేహంగా మెగా ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. ఇదే కదా అసలు సిసలు మెగా పండగ.

You May Like This
- Advertisment -spot_img

Most Popular