HomeMovie News Teluguసైరా... తొలి రోజు బాక్సులు బ‌ద్ద‌లు.

సైరా… తొలి రోజు బాక్సులు బ‌ద్ద‌లు.

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన `సైరా` ఆ అంచ‌నాల‌కు త‌గిన అద్భుత‌మే చేసింది. తొలి షో నుంచే సూప‌ర్ హిట్టు టాక్ సొంతం చేసుకున్న సైరా.. రికార్డుల ప‌రంగానూ బోణీ కొట్టేసింది. తొలి రోజు ఏకంగా 38 కోట్లు వ‌సూలు చేసి ఆల్ టైమ్ టాప్ 2 లిస్టులో చేరింది. బాహుబ‌లి 2 త‌ర‌వాతి స్థానం సైరాదే. తొలి రోజు ప‌రంగా నాన్ బాహుబ‌లి రికార్డుని సైరా బ‌ద్దలు కొట్టిన‌ట్టే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం 180 కోట్లు (గ్రాస్‌) తెచ్చుకుంది.

తెలుగు రాష్ట్రాల లెక్క‌ల్లోకి వ‌స్తే… నైజాంలో 8.1 కోట్లు, సీడెడ్‌లో 5.9 కోట్లు, ఉత్త‌రాంధ్ర‌లో 4.6 కోట్లు, గుంటూరులో 5.6 కోట్లు, ఈస్ట్‌లో4.8 కోట్లు, వెస్ట్ లో 4.02 కోట్లు వ‌చ్చాయి. ఓవ‌ర్సీస్‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడులో కూడా `సైరా`కి భారీ ఓపెనింగ్స్ ల‌భించాయి. అయితే ఆ లెక్క‌ల విష‌యంలో ఓ క్లారిటీ రావాల్సివుంది. గురువారం, శుక్ర‌వారం `సైరా` వ‌సూళ్లు ఇదే స్థాయిలో కొన‌సాగితే.. శ‌ని, ఆదివారాలు మ‌రోసారి దుమ్ము దుల‌ప‌డం ఖాయం. సైరా 500 కోట్ల మార్క్ ని దాట‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular