HomeTelugu'సైరా' ఫస్ట్ రివ్యూ: బాక్సాఫీస్ బద్ధలవ్వడం ఖాయం.

‘సైరా’ ఫస్ట్ రివ్యూ: బాక్సాఫీస్ బద్ధలవ్వడం ఖాయం.

మెగాస్టార్ చిరంజీవి నటించిన మెగా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి‘. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న (అనగా రేపు) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ‘ప్రీమియర్ షోలు’ నేటి నుండే ప్రారంభం కానున్నాయి. రామ్ చరణ్ నిర్మాణం లో ‘కొణిదెల ప్రొడక్షన్స్’ బ్యానర్ లో సుమారు 300 కోట్ల బడ్జెట్ తో సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.

అయితే ఈ చిత్రాన్ని సెన్సార్ కోసం ఓవర్సీస్ లో ప్రదర్శించగా సెన్సార్ బోర్డు మెంబర్ అయిన ‘ఉమైర్ సంధు’ ఈ చిత్రాన్ని వీక్షించి మొదటి రివ్యూ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దాని ప్రకారం ‘సైరా’ చిత్రం తో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం అని తెలిపాడు.

సినిమా చూస్తున్నంత సేపు ఫాన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి అని.. మెగాస్టార్.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో జీవించాడని, ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా రావొచ్చని, చిరు నటించిన 150 చిత్రాలు ఒకెత్తు.. ఈ చిత్రం ఒకెత్తు అనేలా చిరు నటన ఉంటుందని.. ఇతర పాత్రలు కూడా అద్భుతంగా ఉన్నాయని.. అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఒకటేంటి.. ఈ చిత్రం లో అన్నీ ఉన్నాయి.. షూర్ షాట్ హిట్ అని ఈ ట్వీట్ ద్వారా తెలిపాడు.

అయితే ‘ఉమైర్’ ఇలాంటి పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం కోత్తేమి కాదు..గతం లో చాలా ప్లాప్ మూవీస్ కి కూడా ఇలాగే సూపర్ హిట్ రివ్యూస్ ఇచ్చాడు.. ఇంతకు తాను చెప్పినట్టు ‘సైరా’ బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

#SyeRaaNarsimhaReddy Review :
● #SyeRaa is a cinematic gem that you just cannot miss.
● Tremendous performances, deft direction, power-packed screenwriting and dialogue, melodious soundtrack and of course, the lavish mounting — this film has it all.
● Sure Shot HIT ! ⭐⭐⭐⭐ pic.twitter.com/XsLWtbCI5X— Umair Sandhu (@UmairFilms) September 29, 2019

You May Like This
- Advertisment -spot_img

Most Popular