HomeMovie News Teluguరానా హెల్త్‌ మిస్టరీకి చెక్‌ పడేదెప్పుడు?

రానా హెల్త్‌ మిస్టరీకి చెక్‌ పడేదెప్పుడు?

దగ్గుబాటి రానా అంటే గుర్తొచ్చేది ఆరడుగుల ఎత్తు, మాంచి ధిట్టమైన శరీర సౌష్టవం. అందుకే రాజమౌళి ఏరి కోరి భళ్లాలదేవుడి పాత్రలో రానానే ఎంచుకున్నాడు. అయితే, ఈ మధ్య రానా హెల్త్‌కి సంబంధించి రకరకాల గాసిప్స్‌ పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో రానా బాధపడుతున్నాడనీ, మేజర్‌ సర్జరీ చేయించుకున్నాడనీ, అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నాడనేది ఈ వార్తల సారాంశం.

అయితే, రానా ప్రస్తుతం చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా, ఆఖరికి హాలీవుడ్‌తో సహా చేయాల్సిన పలు ప్రాజుక్టులు చేతిలో పెట్టుకున్నాడు మనోడు. అయినా కానీ, హెల్త్‌కి సంబంధించిన రూమర్స్‌ అయితే ఆగలేదు. ఎప్పటికప్పుడే అలాంటి రూమర్స్‌ వచ్చినప్పుడు హాట్‌ హాట్‌గా ఫోటోలు రిలీజ్‌ చేస్తూ, చెప్పకనే చెప్పినట్లుగా సదరు గాసిప్‌ దారుల నోర్లు మూయిస్తున్నాడు రానా. అయితే, తాజాగా రానా రిలీజ్‌ చేసిన ఫోటో ఒకటి నెటిజన్స్‌ని పలు అనుమానాలకు గురి చేస్తోంది.

దిట్టంగా ఉండే రానా ఈ ఫోటోలో చాలా సన్నగా కనిపిస్తున్నాడు. అయితే, ఇది తను చేస్తున్న ‘హాథీ మేరీ సాథీ’ సినిమా లోని లుక్‌ అని కూడా తెలుస్తోంది. తెలుగులో రానా ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తున్నాడు. హెల్త్‌ ప్రాబ్లమ్‌ ఉన్న మాటని పూర్తిగా కొట్టిపారేయలేం. కానీ, అదేమంత సీరియస్‌ ప్రాబ్లెమ్‌ కాదన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ఈ ఇష్యూని రానా కానీ, ఆయన తండ్రి సురేష్‌ బాబు కానీ కన్‌ఫామ్‌ చేస్తే బాగుండేది. ఎందుకో రానా అండ్‌ ఫ్యామిలీ ఈ విషయాన్ని చాలా లైట్‌ తీసుకుంటున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular