HomeMovie News Teluguలేడీ రోబోకి బుజ్జి రోబో పుట్టిందోచ్‌.!

లేడీ రోబోకి బుజ్జి రోబో పుట్టిందోచ్‌.!

అందాల భామ అమీజాక్సన్‌ బుజ్జి పాపాయికి జన్మనిచ్చింది. గత కొన్నాళ్లుగా బేబీ బంప్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూ హాట్‌ హాట్‌ పిక్స్‌ని పోస్ట్‌ చేస్తూ, సోషల్‌ మీడియా దృష్టిని తన వైపు నుండి మరల్చకుండా చూసుకున్న అమీజాక్సన్‌ తొమ్మిది నెలలు మోసి, ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బుజ్జి పాపాయి పేరు ”యాండ్రియాస్‌’ అని చెబుతూ, మా ఏంజెల్‌.. ప్రపంచానికి స్వాగతం..’ అంటూ ఫోటో పోస్ట్‌ చేసింది. నిజానికి అమీ జాక్సన్‌ తనకు బాబు పుడతాడనుకుంది. బాబు పుడతాడంటూ డెలివరీకి ముందు ఓ గ్రాండ్‌ పార్టీ కూడా అరేంజ్‌ చేసింది అమీజాక్సన్‌.

అయితే, మన లేడీ రోబో తనలాగే క్యూట్‌గా ఉన్న బుజ్జి గాళ్‌ రోబోకి జన్మనిచ్చింది. కొన్నేళ్లుగా అమీజాక్సన్‌, తన బోయ్‌ ఫ్రెండ్‌ జార్జ్‌ పనాయో టూతో డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరికీ ఇటీవలే నిశ్చితార్ధం కూడా జరిగింది. ఇంకా పెళ్లి కాలేదు. కానీ, బుల్లి ఏంజెల్‌కి తల్లితండ్రులయ్యారు ఈ డేటింగ్‌ కపుల్‌. ఇకపోతే, అమీజాక్సన్‌ హీరోయిన్‌గా కనిపించిన లాస్ట్‌ మూవీ ‘రోబో 2.0‘.

ఆ తర్వాత ప్రెగ్నెంట్‌ కావడం, ఆ ముచ్చటను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుని మురిసిపోవడం, ఇదిగో ఇప్పుడు ఆ బేబీ బంప్‌ని ప్రపంచానికి పరిచయం చేసేయడం కూడా జరిగిపోయాయి. ఇక అమీజాక్సన్‌ నెక్స్‌ట్‌ ఏంటీ.? మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందా.? లేక బుజ్జి పాప ‘యాండ్రియాస్‌’ కోసమే తన విలువైన సమయాన్ని కేటాయిస్తుందా.? చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular