HomeMovie News Teluguఊపు ఊపేస్తోన్న జిగేల్‌ రాణి అలియాస్‌ శ్రీదేవి.

ఊపు ఊపేస్తోన్న జిగేల్‌ రాణి అలియాస్‌ శ్రీదేవి.

‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటించింది పూజాహెగ్దే. నిజానికి ఈ సినిమాలో పూజాది గెస్ట్‌ రోలే. కానీ, ఆ రోల్‌ సినిమాకి చాలా హైలైట్‌ అయ్యింది. ఇక ఓల్డ్‌ సాంగ్‌ రీమిక్స్‌ ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ సాంగ్‌లో నటించడం పూజాకి ఓ స్పెషల్‌ ఎక్స్‌పీరియన్స్‌. శ్రీదేవి అంతటి నటి పాత్రలో కనిపించడమంటే మొదట్లో చాలా భయపడిందట. శ్రీదేవిలా డాన్స్‌ చేయడం, ఆ పాత్రను మ్యాచ్‌ చేయడంలో ఆడియన్స్‌ తనని ఎలా రిసీవ్‌ చేసుకుంటారా.? అని చాలా టెన్షన్‌ పడిందట. కానీ, సినిమా విడుదలయ్యాక ఈ పాట ఊపేస్తున్న ఊపుడు అంతా ఇంతా కాదు.

ఖచ్చితంగా సినిమాకి ఈ పాట ప్లస్‌ అయ్యింది. ధియేటర్‌లో ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్‌ మామూలుగా లేదు. మాస్‌ ఆడియన్స్‌ని ఈ పాట చాలా బాగా ఆకట్టుకుంటోంది. క్లాసిక్స్‌ని మళ్లీ టచ్‌ చేస్తే, సక్సెస్‌ అవడం చాలా ఆరుదుగా జరుగుతుంటుంది. కానీ, ‘ఎల్లువొచ్చి గోదారమ్మ..’ పాట గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా, ఆ పాట గొప్పతనాన్ని, గౌరవాన్ని మరింత పెంచేలా ఈ పాటను చిత్రీకరించారు.

వరుణ్‌ తేజ్‌, పూజా హెగ్దే తమ వంతు న్యాయం చేశారు. ‘జిగేల్‌ రాణి’ తర్వాత శ్రీదేవిగా ఈ పాట పూజాహెగ్దే కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ప్రస్తుతం పూజా హెగ్దే ప్రబాస్‌ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే అఖిల్‌ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. వెరీ లేటెస్ట్‌గా పూజా, అఖిల్‌ సినిమా సెట్స్‌లో అడుగు పెట్టిందని తెలుస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular