HomeMovie News Teluguమెగా డాటర్‌కి మెగాస్టార్‌ ప్రశంస!

మెగా డాటర్‌కి మెగాస్టార్‌ ప్రశంస!

ఇద్దరు మెగాస్టార్లు స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి‘. ఈ సినిమాలో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవికి గురువుగా బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి పని చేసిన ఎంతో మంది ప్రముఖ టెక్నీషియన్స్‌లో మెగా డాటర్‌ సుస్మిత ఒకరు. ఈ సినిమాకి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసింది సుస్మిత. తండ్రి చిరంజీవి కాస్ట్యూమ్స్‌ని డిజైన్‌ చేయడంతో పాటు, అమితాబ్‌ బచ్చన్‌ పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్‌ని కూడా ఆమెనే డిజైన్‌ చేశారు.

షెడ్యూల్‌కి తగ్గట్లుగా అద్భుతంగా కాస్ట్యూమ్‌ డిజైన్‌ చేసినందుకు అమితాబ్‌ బచ్చన్‌ సుస్మితను ప్రత్యేకంగా అభినందించేవారట. ప్రతీ షెడ్యూల్‌కీ షెడ్యూల్‌ చివరిలో మర్చిపోకుండా ఆయన సుస్మితను అభినందించే తీరు దేనికీ సాటి రాదని సుస్మిత ఎంతో మర్యాదగా తెలిపింది. చిరంజీవి నటించిన చాలా సినిమాలకు సుస్మిత కాస్ట్యూమ్‌ డిజైన్‌ చేసింది. కానీ, ‘సైరా’ సినిమా తనకెంతో ప్రత్యేకం అని చెబుతోంది. ఇలాంటి ఓ చారిత్రాత్మక చిత్రానికి దుస్తులు డిజైన్‌ చేయడమంటే, నిజంగా కత్తి మీద సామే.

ఈ వ్యవహారంలో తనకు మిగిలిన టెక్నీషియన్లు అందించిన సహకారం, తమ్ముడు రామ్‌చరణ్‌ అందించిన ప్రోత్సాహం గొప్పవని సుస్మిత తెలిపింది. అక్టోబర్‌ 2న ‘సైరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో మరో మెగా డాటర్‌ నిహారిక గిరిజన యువతి పాత్రలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే. నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటించారు. అమిత్‌ త్రివేది బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular