HomeMovie News Teluguటాలీవుడ్‌ 'కింగ్‌' నాగార్జున ఆల్వేస్‌ వెండితెర 'మన్మధుడు'!

టాలీవుడ్‌ ‘కింగ్‌’ నాగార్జున ఆల్వేస్‌ వెండితెర ‘మన్మధుడు’!

ప్రయోగాలకు పెట్టింది పేరు కింగ్‌ నాగార్జున. అగ్ర హీరోల్లో ఆయన చేసినన్ని ప్రయోగాలు మరో హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదేమో. సైకిల్‌ చైన్‌ పట్టి యూత్‌ని ఉర్రూతలూగించినా, అన్నమయ్యగా భక్తి ఊయలతో డోలలాడించినా, ‘మన్మధుడు‘గా అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టేసినా, వీల్‌ చైర్‌లో కూర్చొని కూడా ఎమోషన్స్‌ పండించేసినా.. అది నాగార్జున ఒక్కడికే చెల్లింది. 60 లలో కూడా 20ల గ్లామర్‌ మెయింటైన్‌ చేసే నాగార్జున గ్లామర్‌ సీక్రెట్‌ ఎప్పటికీ సీక్రెట్‌గానే ఉండిపోతుంది.

హాయిగా నవ్వుతూ, నవ్విస్తూ, ఏ టెన్షన్‌ లేకుండా ఉండడమే తన గ్లామర్‌ సీక్రెట్‌ అంటాడు కానీ, అలా ఉండడం కూడా ఆయనకే సాధ్యం. ఇక ఆయన యంగ్‌గా ఉండాలనుకోవడమే కాదు, ఇండస్ట్రీలో యంగ్‌ టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేయడంలోనూ నాగార్జున ముందుంటాడు. అందుకే, యంగ్‌ జనరేషన్‌ నాగార్జున కోసం ఎప్పటికప్పుడే కొత్త కొత్త కథలను సృష్టిస్తూ ఉంటారు. తన వద్దకు వచ్చిన యంగ్‌ దర్శకుల్ని ఎప్పుడూ డిజప్పాయింట్‌ చేయడు నాగార్జున. అలాగే మల్టీ స్టారర్స్‌కి సై అన్న అగ్రహీరోల్లో నాగార్జునదే మొదటి స్థానమని చెప్పాలి. సుమంత్‌, మంచు విష్ణు వంటి యంగ్‌ హీరోస్‌తో మల్టీ స్టారర్స్‌ చేశాడు గతంలో.

ఇప్పుడు నాని, కార్తి వంటి హీరోలతో నటించి వారికి మరింత ఎంకరేజ్‌మెంట్‌ అందించాడు. ‘అన్నమయ్య’తో తెలుగు ఆధ్యాత్మిక చిత్రం స్వరూపం మార్చేశాడు. ‘సోగ్గాడు’గా వెండితెరపై వెలిగిపోయాడు. 60కి చేరువవుతున్న తరుణంలో యంగ్‌ హీరోయిన్‌ రకుల్‌తో ‘మన్మధుడు 2’లో నటించి నో డౌట్‌ ఆల్వేస్‌ కింగ్‌ నాగ్‌ టాలీవుడ్‌ మన్మధుడే అనిపించాడు. అలాంటి మన టాలీవుడ్‌ మన్మధుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular