HomeMovie News Teluguనటుడు, 'గురువు' దేవదాస్‌ కనకాల ఇక లేరు!

నటుడు, ‘గురువు’ దేవదాస్‌ కనకాల ఇక లేరు!

సినీ నటుడు, దర్శకుడు, నటనలో చాలామందికి ‘గురువు’ అయిన దేవదాస్‌ కనకాల ఇక లేరు. ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించిన దేవదాస్‌ కనకాల, నటుడిగా కంటే నట శిక్షకుడిగానే పేరు ప్రఖ్యాతులు గడించారు. నటనలో ఎందరికో ఓనమాలు దిద్దారాయన. గొప్ప నటులుగా తన శిష్యులు ఎదుగుతోంటే చూసి మురిసిపోయారు. దేవదాస్‌ కనకాల తనయుడు రాజీవ్‌ కనకాల, నటుడిగా సినీ పరిశ్రమలో తనదైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విషయం విదితమే.

కోడలు సుమ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? దేవదాస్‌ కనకాల సతీమణి కూడా నటనలో ఎందరికో శిక్షణ అందించారు. దేవసదాస్‌ కనకాల, ఆయన సతీమణి నిర్వహించిన యాక్టింగ్‌ స్కూల్‌ నుంచి సినీ పరిశ్రమకు ఎందరో ఆణిముత్యాలు నటీనటులుగా పరిచయమయ్యారు.

దేవదాస్ కనకాల పార్ధీవ దేహం కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి లో వుంది.  ఈ రోజు తీసుకు రావట్లేదు  రేపు ఉదయం ఎనిమిది గంటలకు  మణికొండ మర్రిచెట్టు వద్ద నున్న ఇంటికి తీసుకొస్తారు ఉదయం 11:30 నిమిషాల వరకు ఇంటి దగ్గర బాడీ ఉంచి తర్వాత దహన సంస్కరణ కార్యక్రమానికి తీసుకువెళ్లడం జరుగుతుంది.

కాగా, దేవదాస్‌ కనకాల మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘తల్లిదండ్రుల్ని కోల్పోయినంత బాధగా వుందంటూ’ ఆయన వద్ద నటనలో ఓనమాలు నేర్చుకున్న నటీనటులు కన్నీరు మున్నీరవుతున్నారు. దేవదాసు కనకాల స్వస్థలం యానాం. భార్య లక్ష్మి కనకాల మరణం తర్వాత దేవదాస్‌ కనకాల మానసికంగా కుంగిపోయారు. 1945 జులై 30న దేవదాస్‌ కనకాల జన్మించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular