HomeMovie News Teluguబిగ్‌బాస్‌-3: నాగార్జున ప్లానింగే ప్లానింగ్‌!

బిగ్‌బాస్‌-3: నాగార్జున ప్లానింగే ప్లానింగ్‌!

కింగ్‌ అక్కినేని నాగార్జున, బిగ్‌బాస్‌ రియాల్టీ షో మూడో సీజన్‌ హోస్ట్‌గా వ్యవహరించనున్న విషయం విదితమే. అయితే, హోస్ట్‌గా వ్యవహరించేందుకోసం అక్కినేని నాగార్జున ముందస్తుగా చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు, ఈ షో విషయంలో తనదైన వ్యూహాల్ని కూడా రచించుకున్నాడట. అందులో బాగంగానే, మూడో సీజన్‌ని దుమ్ము రేపేలా నడపబోతున్నాడట.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలో విడుదల కానున్న చాలా సినిమాల ప్రమోషన్స్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ వేదికగా జరగబోతున్నాయని సమాచారమ్‌. ఇందులో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సాహో‘ కూడా వుండొచ్చంటున్నారు. మరోపక్క, మెగాస్టార్‌ చిరంజీవిని కూడా బిగ్‌ హౌస్‌కి రప్పిస్తారట. హౌస్‌కి రప్పించడమంటే, వీకెండ్‌లో.. వేదికపైనుంచి చిరంజీవితో నాలుగు మాటలు చెప్పించేయడమే కాదు, హౌస్‌లోకి కూడా తీసుకెళతారట. మరోపక్క, విజయ్‌ దేవరకొండనీ బిగ్‌హౌస్‌కి రప్పించాలనే ప్లాన్‌లో వున్నాడట నాగార్జున.

ఒకటా? రెండా? ఏకంగా 100 రోజులు.. మధ్యలో వచ్చే బోల్డన్ని వీకెండ్స్‌.. వెరసి, బిగ్‌బాస్‌ మూడో సీజన్‌.. సెలబ్రిటీలతో నిండిపోతే అంతకన్నా కావాల్సిందేముంది.? గతంలోనూ కొన్ని సినిమాల ప్రమోషన్‌ బిగ్‌బాస్‌ రియాల్టీ షో ద్వారా జరిగినా, ఈసారి ‘అంతకు మించి’ హంగామా వుంటుందని తెలుస్తోంది. ఇదంతా నాగార్జున ప్లానింగేననీ, నాగార్జున వీటన్నిటి విషయంలో ముందే ఓ ఖచ్చితమైన వ్యూహాన్ని రచించుకున్నాడనీ అంటున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular