HomeMovie News Teluguరెండో పెళ్లి చేసుకున్న అల్లువారబ్బాయ్‌.!

రెండో పెళ్లి చేసుకున్న అల్లువారబ్బాయ్‌.!

అల్లు వారబ్బాయ్‌ అంటే ఇంతవరకూ అల్లు అర్జున్‌ తమ్ముడు శిరీష్‌నే పరిగణనలోనికి తీసుకుంటాం. కానీ, అల్లువారబ్బాయ్‌ ఇంకొకరున్నారు. ఆయనే అల్లు అర్జున్‌కి అన్నయ్య అల్లు బాబి. ఈయనకు పెద్దగా సినిమాలతో టచ్‌ లేదు. కానీ, ఈ మధ్య స్టైల్‌ ఐకాన్‌ లిస్టులో ఈయన పేరు అడపా దడపా వినిపిస్తోంది. ఓ ప్రముఖ దర్శకుడు అల్లు వారింట్లో అందగాడు బాబీనే అంటూ ఈ మధ్య సర్టిఫికెట్‌ కూడా ఇచ్చేశారు.

కానీఈయనెవరనేది ఎవరికీ పెద్దగా తెలీదు. ఇకపోతే, ఇప్పుడు ఈయనగారి గురించి ఎందుకు ప్రస్థావించాల్సి వచ్చిందంటే, తాజాగా ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. 2005లో మొదటి వివాహం చేసుకున్నారు. ఏవో ఫ్యామిలీ కారణాలతో 2016లో పీస్‌ఫుల్‌గానే ఆమెతో వివాహం రద్దు చేసుకున్నారు. డివోర్స్‌ తీసుకున్నారు. ఇప్పుడు అనగా 2019లో ఆయన మళ్లీ వివాహం చేసుకున్నారు.

‘దేవుడుమళ్లీ నన్ను రెండో పెళ్లి కోసం ఆశీర్వదించాడు.. నా కుటుంబం నుండి పూర్తిగా నాకు ఈ విషయంలో సహకారముంది..’ అంటూ ఆయన సోషల్‌ మీడియాలో పెళ్లి ఫోటోలతో సహా పోస్ట్‌ చేశారు. అత్యంత సన్నిహితులు సమక్షంలో అల్లు బాబీ రెండో వివాహం జరిగింది. అదీ సంగతి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular