HomeMovie News Teluguచిన్మయిని ఆడేసుకుంటున్నారు.!

చిన్మయిని ఆడేసుకుంటున్నారు.!

తాజాగా విడుదలైన ‘మన్మధుడు 2‘ టీజర్‌ని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ గాయని చిన్మయి కూడా రెస్పాండ్‌ అయ్యింది. ‘మన్మధుడు 2′ టీజర్‌ చూశాను.. వావ్‌..! చాలా బాగుంది..’ అని సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేసింది. ‘వావ్‌’ అనే ఈ రెస్పాన్స్‌ చిన్మయికి తంటా తెచ్చి పెట్టింది. ఏముంది.? ఇందులో తంటా తెచ్చేందుకు..? అనుకుంటున్నారా.? అయితే మీకు ఫ్లాష్‌ బ్యాక్‌ గురించి తెలీదనుకుంటా.? కొంచెం వెనక్కి వెళితే, ‘మీటూ ఉద్యమం జోరుగా నడుస్తున్న రోజులవి.. ఆ రోజుల్లో పలువురు హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక దాడుల్ని బహిర్గతం చేస్తూ, పలువురు నట ప్రముఖులపై ఆరోపణలతో రెచ్చిపోయిన సంగతి గుర్తొచ్చే ఉంటుంది.. సరిగ్గా ఆ సమయంలోనే మన గాయని చిన్మయి గారు కూడా టైమొచ్చింది కదా అని.. ముందూ వెనకా చూసుకోకుండా రెచ్చిపోయి లెక్చర్స్‌ ఇచ్చేసింది. బహుశా అప్పుడు పాపకి పాపం తెలీదనుకుంటా.. తన భర్త ‘మన్మధుడు 2’ అనే ఓ సినిమా తీస్తాడు..

అందులో ఆరు పదులకు దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి (నాగార్జున) హీరోగా నటిస్తాడనీ, కాదు కాదు.. టీనేజ్‌ అమ్మాయిలతో (తన కన్నా వయసులో చాలా చిన్నవాళ్లైన హీరోయిన్లతో) రొమాన్స్‌ చేస్తాడనీ ఊహించలేదు కాబోలు.. అందుకే అలా రెచ్చిపోయి నోరు జారేసింది. ఇంతకీ చిన్మయి అప్పట్లో ఏమందో తెలుసా.? అరవైల వయసున్న హీరోలకు టీనేజ్‌ హీరోయిన్లు కావాల్సి వస్తోంది.. అని. ఇప్పుడు మరి తన భర్త చేసిందేంటో కదా. అందుకే ‘మన్మధుడు 2’ టీజర్‌ని మెచ్చుకునే హక్కు చిన్మయికి లేదంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. నీ హజ్‌బెండ్‌కైతే నీ రూల్స్‌ పని చేయవా.? అని రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. ‘సినిమా విడుదలయ్యాక అర్ధమవుతుంది నా భర్త అలాంటి సినిమా ఎందుకు తీశాడని.. పోయి పని చూస్కోవోయీ..’ అంటూ సదరు నెటిజన్స్‌ కామెంట్స్‌ని ఘాటుగా తిప్పి కొడుతోంది చిన్మయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular