HomeMovie News Teluguమహేష్ కోసం దిగివస్తున్న పవన్ కళ్యాణ్..

మహేష్ కోసం దిగివస్తున్న పవన్ కళ్యాణ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి.. తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ చిత్రంగా అద్భుతమైన స్పందన దక్కించుకుంది. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా వసూళ్లు రాబడుతుంది. అటు ఓవర్సీస్ లో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఓపెనింగ్స్ తో చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డ్స్ సొంతం చేసుకుంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇప్పటీకే పలువురు సెలెబ్రిటీలు మెచ్చుకుని ప్రశంసలతో చిత్ర బృందాన్ని తారా స్థాయికి ఎత్తేసారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఈ చిత్రం లో రైతు సమస్యలు వాటి పరిష్కారం పై ప్రస్తావించిన సన్నివేశాలను హైలైట్ గా చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఇక ఈ లిస్ట్ లో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేరనున్నట్టు సినీ వర్గాల్లో వినబడుతున్న వార్త.

మొదటి నుంచీ రైతులు వారి సమస్యల పై ప్రత్యేక శ్రద్ధ చూపించే పవన్ కి త్వరలోనే ఈ చిత్రాన్ని చూసే ఉద్దేశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం పార్టీ పనుల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వీలు చూసుకుని ‘మహర్షి’ చిత్రాన్ని వీక్షించనున్నారనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇదే జరిగితే అటు పవన్ అభిమానులకి, ఇటు మహేష్ అభిమానులకి పండగే అని చెప్పొచ్చు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular