HomeMovie News Teluguఅచ్చు ఎన్టీఆర్‌లానే కానీ!

అచ్చు ఎన్టీఆర్‌లానే కానీ!

హీరోలకు అభిమానులుండడం సహజం. ఆ అభిమానంతో వారి హావభావాలను అనుకరించడమూ సహజమే. అయితే అచ్చు తమ తమ అభిమాన హీరోల్ని మక్కీకి మక్కీ అనుకరిస్తే, వారిని డూప్‌లు అంటారు. ఇది తెలిసిన విషయమే. అయితే, మన భాష రాని, ఓ వ్యక్తి అభిమానం చూస్తే ఆశ్చర్యపోవల్సిందే. అలాంటి వ్యక్తి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. పేరు షమీందర్‌ సింగ్‌. పంజాబీ కుర్రోడు.

ఎరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పట్టా పొందిన ఈ షమీందర్‌ సింగ్‌ ఎన్టీఆర్‌కి పిచ్చ అభిమాని. ఎప్పటి నుండో ఎన్టీఆర్‌ని ఫాలో అవుతున్నాడీ కుర్రోడు. ఫాలోయింగ్‌ అంటే అలాంటి ఇలాంటి ఫాలోయింగ్‌ అనుకుంటున్నారా.? తనని తాను అచ్చు ఎన్టీఆర్‌లా మార్చేసుకున్నాడు. మార్చుకోవడం కాదులెండి. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు కదా. అలా ఎన్టీఆర్‌ పోలిన రెండో వ్యక్తి ఈయనే కాబోలు. సోషల్‌ మీడియాలో తాజాగా ఈ కుర్రోడి వీడియోలు కుప్పలు తెప్పలుగా హల్‌చల్‌ చేస్తున్నాయి.

సడెన్‌గా చూస్తే పొరపాటు పడాల్సిందే. పొరపాటేంటీ.. అచ్చు ఎన్టీఆర్‌నే తలపిస్తున్నాడీ కుర్రోడు.ఎప్పటి నుండో ఎన్టీఆర్‌ని కలవాలనుకుంటున్నాడట. ఇప్పటికి మీడియా కంట్లో పడ్డాడు. ‘ప్లీజ్‌ రిప్లై’ అంటూ ఎన్టీఆర్‌ రిప్లై కోసం ఎదురు చూస్తున్నాడు. ఏ మాటకామాటే చెప్పాలి, ఎన్టీఆర్‌ కంటే చాలా చాలా అందంగా ఉన్నోడీ కుర్రోడు. సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ సినిమాల్లోని డైలాగులను డబ్‌ స్మాష్‌ వీడియోలుగా పోస్ట్‌ చేసి, ఈ షమీందర్‌సింగ్‌ ఆకట్టుకుంటున్నాడు. చూడాలి మరి, ఇప్పుడైనా ఈ పంజాబీ వీరాభిమానిని ఎన్టీఆర్‌ గుర్తిస్తాడో లేదో.?

You May Like This
- Advertisment -spot_img

Most Popular