HomeMovie News Teluguనిధి అగర్వాల్‌ 'ముద్దు' ముచ్చట.!

నిధి అగర్వాల్‌ ‘ముద్దు’ ముచ్చట.!

ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ ముద్దుల్లో మునిగి తేలుతోంది. ఎవరో ఒక హీరోతోనో, ఏదో ఒక సినిమా కోసమో అనుకుంటే పొరపాటే. తన ఫ్రెండ్‌ షాన్‌ ముట్టతిల్‌. ఈ షాన్‌ ముట్టతిల్‌ మరెవరో కాదు, ఫేమస్‌ సెలబ్రిటీ హెయిర్‌ స్టైలిష్ట్‌. చాలా మంది ముద్దుగుమ్మలకు హెయిర్‌ స్టైల్స్‌ చేస్తుంటాడు. బాలీవుడ్‌లో పలువురు స్టార్‌ సెలబ్రిటీలతో ఈయనకు మంచి స్నేహముంది. అలాగే నిధి అగర్వాల్‌తోనూ స్నేహ సంబంధాలున్నాయి. అయితే నిధితో ఈయనకున్న స్నేహం ఇంకొంచెం ఎక్కువ. 

షాన్‌ ముట్టతిల్‌ని తన బెస్ట్‌ ఫ్రెండ్‌గా అభివర్ణిస్తోంది నిధి అగర్వాల్‌. ఇంతకీ ఇప్పుడీయనగారి టాపిక్‌ ఎందుకొచ్చిందంటారా.? తాజాగా నిధి అగర్వాల్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ అయిన ఓ పిక్‌ ఇప్పుడు నెట్టింట్లో ఫుల్‌ వైరల్‌గా మారింది. అంత వైరల్‌ అయిన ఈ పిక్‌లో ఏముందంటారా.? అంటే నిధిని గాఢంగా ముద్దు పెట్టుకుంటున్నాడు షాన్‌ ఈ పిక్‌లో. ఆ ముద్దులాటని నిధి బాగా ఎంజాయ్‌ చేస్తోంది. ఈయనతో నిధి అగర్వాల్‌కి ఎప్పటి నుండో ఫ్రెండ్‌షిప్‌ ఉందట. 

బాలీవుడ్‌లో ‘మున్నా మైఖేల్‌’ సినిమాతో సినిమా రంగానికి పరిచయమైన నిధి అగర్వాల్‌ అంతకు ముందే షాన్‌తో పరిచయమున్నట్లు చెబుతోంది. ఏది ఏమైనా నిధి అగర్వాల్‌ స్క్రీన్‌పై హీరోలతోనే కాక, ఇలా ఫ్రెండ్స్‌ కమ్‌ తెర వెనక టెక్నీషియన్స్‌తో ముద్దు ముచ్చట్లతో ఇన్వాల్వ్‌ కావడం పట్ల నెటిజన్లు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా మిశ్రమ స్పందన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్‌ రామ్‌తో ‘ఇస్మార్ట్‌ శంకర్‌‘ సినిమాలో నటిస్తోంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular